చిరంజీవితో చేసే అవకాశం రెండు సార్లు చేజారింది

Update: 2020-09-30 10:10 GMT
ఫ్యామిలీ సినిమాలతో పాటు ఫాంటసీ సినిమాలను కూడా తెరకెక్కించి 1990లో స్టార్‌ డైరెక్టర్‌ గా వెలుగు వెలిగిన ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా అలీ టాక్‌ షో లో పాల్గొన్నారు. ఆయన ఆరు పదుల వయసులో కూడా చాలా యాక్టివ్‌ గా యంగ్‌ గా కనిపించారు. ఆ విషయాన్నే అలీ ప్రస్థావించగా ఆయన గట్టిగా నవ్వేశారు. అలీని యమలీల సినిమాతో హీరోగా చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. అందుకే ఆయన్ను అలీ గురుజీ అంటూ ఇంటర్వ్యూ చేశాడు. ఈ టాక్‌ షో చాలా సరదగా సాగిపోయింది. ముఖ్యంగా యమలీల గురించి ఎక్కువ సమయం చర్చ జరిగింది.

ఆ కథ అనుకున్న సమయంలో చాలా మంది పెద్ద హీరోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. కాని నేను అనుకున్న కథ ప్రకారం హీరో కొత్త వాడు అయ్యి ఉండాలి.. చూడగానే ఏంటికి పనికి రానివాడిలా కనిపించాలి. అలా అప్పుడు ఉన్న హీరోలు ఎవరు కనిపించరు. కనుక నిన్ను(అలీ) ఎంపిక చేశాను అన్నాడు. 1993లో మాయలోడు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ నుండి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ ను మెప్పించింది.

చిరంజీవి గారితో శుభలగ్నం తర్వాత సినిమాను చేయాలని రెడీ అయ్యాను. అశ్వినీదత్‌ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సినిమాను లాంచ్‌ కూడా చేశాము. అయితే సినిమాకు హై టెక్నాలజీ అవసరం.. ఎక్కువ బడ్జెట్‌ కావాల్సి వచ్చింది. దాంతో ఆ బడ్జెట్‌ వర్కౌట్‌ అవుతుందో లేదో అనే భయంతో సినిమాను వదిలేశాం. ఇప్పుడు అది చేస్తే ఖచ్చితంగా భారీ సినిమా అవుతుంది. అలా మొదటి సారి చిరంజీవి గారితో చేసే అవకాశం చేజారింది. ఆ తర్వాత చిరంజీవి గారు హీరోగా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో రూపొందిన ఒక సినిమాకు నన్ను సంగీతం అందించమన్నారు. ఆ సమయంలో నేను ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పాను. అలా రెండు సార్లు చిరంజీవి గారితో వర్క్‌ చేసే అవకాశం చేజారిందని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.
Tags:    

Similar News