సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరిపై కోర్టు అనుమానం?

Update: 2021-02-16 07:30 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం మిస్ట‌రీ కేసు ఇప్ప‌టికీ కోర్టుల ప‌రిధిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ర‌ణం వెన‌క నిజానిజాలేమిటి? అన్న‌ది సీబీఐ తేల్చనే‌లేదు. మ‌రోవైపు సుశాంత్ సోద‌రీమ‌ణుల‌పై రియా చ‌క్ర‌వ‌ర్తి వ‌రుస కేసులు కూడా సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుతం వీటిపై కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది.

ఇంత‌కుముందు సుశాంత్ సోద‌రీమ‌ణులు ప్రియాంక సింగ్- మీతూ సింగ్ ల‌పై రియా చ‌క్ర‌వ‌ర్తి బొంబాయి హైకోర్టులో పిటిష‌న్ వేయ‌గా.. దానిని తాజాగా విచారించింది. అయితే ఈ కేసు నుంచి  మీతు సింగ్ కి ఉప‌శ‌మ‌నం లభించ‌గా ప్రియాంక‌ను మాత్రం కోర్టు విడిచిపెట్ట‌లేదు. మీతూ పై రియా చక్రవర్తి నమోదు చేసిన కేసుల‌పై విచారించిన బాంబే హైకోర్టు సోమవారం ఎఫ్.‌ఐ.ఆర్ రద్దు చేసింది. కానీ ప్రియాంక‌కు ఉప‌శ‌మ‌నం లభించ‌లేదు.

కోర్టు ఒక సోదరికే ఎందుకని ఉపశమనం క‌ల్పించింది? మరొకరికి ఎందుకు అవ‌కాశం లేదు? అంటే...న‌టి రియా చక్రవర్తి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ``చట్టబద్దంగా అనుమతించదగిన కౌంటర్-ఫిర్యాదు రియా చేశారు`` అని బొంబాయి హైకోర్టు అభిప్రాయపడింది. సీబీఐ విచార‌ణ‌కు కోర్టు అడ్డు ప‌డ‌కుండా న్యాయ‌విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డానికే ప్రియాంక‌పై కేసు కొన‌సాగాల‌ని సూచించింది. ఇక సుశాంత్ మ‌ర‌ణం స‌మ‌యంలో వాట్సాప్ చాట్ లు ఏవీ మీతూ చేయ‌లేద‌ని కూడా కోర్టు స్ప‌ష్ఠ‌త‌నిచ్చింది. అందుకే త‌న‌పై ఎఫ్‌.ఐ.ఆర్ ర‌ద్ద‌య్యింది.

బాంబే హై కోర్ట్ ఏమి చెప్పింది? అంటే..ప్రియాంక సింగ్ - డాక్టర్ తరుణ్ కుమార్ నియంత్రిత పదార్థాలను సుశాంత్ కు సూచించడానికి కుట్ర పన్నారా లేదా? అన్న‌ది తేలాలంటే... వ్యక్తుల చర్యలను దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. రికార్డులో ఉన్న విష‌యం చూస్తే.. వైద్యుడితో ఆన్ లైన్ సంప్రదింపులు కూడా జరగలేదని ప్రిస్క్రిప్షన్ కల్పితమైనదని తెలుస్తూ ఉన్న‌ప్పుడు  దర్యాప్తు అవసరం అని కోర్టు తెలిపింది.

దిల్లీలో జారీ చేశార‌ని ప్రియాంక చెప్పిన నాటి OPD రిజిస్ట్రేషన్ కార్డు కల్పితమైనదని రియా చక్రవర్తి ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో ముంబైలో ఉన్న దివంగత నటుడు సుశాంత్ ని పరిశీలించకుండానే జారీ చేసిన లెట‌ర్ అది.  న్యూదిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో రూం నెంబర్ 6 లోని నటుడు రాజ్‌పుత్ ను డాక్టర్ తరుణ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ) ఉద్దేశపూర్వకంగా పరిశీలించారని.. అతడు ఆందోళనతో బాధపడుతున్నారని అతనికి మందులు ఇచ్చారని ఒపిడి రిజిస్ట్రేషన్ కార్డు వెల్లడించింది.

హైకోర్టు మాట్లాడుతూ, ..ఒక వైద్యుడితో ఆన్‌లైన్ సంప్రదింపులు కూడా జరగకుండా ప్రిస్క్రిప్షన్ కల్పితం అనే ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే..., దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఫిర్యాదును నిర్వహించలేనిదిగా ఉంచడం సాధ్యం కాదు".

మీతూకు వ్యతిరేకంగా కోర్ట్ నమ్మకంపై ఆధారపడింది రియా చక్రవర్తి ప్రతిపాదించిన అన్ని ఆధారాలను కూడా కోర్టు పరిశీలించింది. బీహార్ మాజీ క్రికెటర్ మీటుపై ఆరోపణలు కేవ‌లం అనుమానం ఆధారంగా మాత్రమే అని అభిప్రాయపడింది కోర్టు.
Tags:    

Similar News