సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కజిన్ పై హత్యాయత్నం!?
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై ఇంకా దర్యాప్తులో ఏదీ తేలలేదు. ఇది ఆత్మహత్య అని పోలీసులు ధృవీకరించినా కాదు అని విచారణను ప్రారంభించారు. ఇందులో ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైనల్ రిపోర్టులపై ఇంకా సీబీఐ ఫైనల్ విషయాన్ని వెల్లడించలేదు.
ఈలోగా సుశాంత్ సింగ్ కజిన్ హత్య సంచలనమైంది. బీహార్ లోని సహర్సా జిల్లాలో శనివారం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బంధువు సహా మరో ఇద్దరిపై ముగ్గురు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనను సహర్సా ఎస్పీ లిపి సింగ్ ధృవీకరించారు. ఈ సంఘటనలో బాధితులలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అతను ప్రాణాలతో పోరాడుతున్నారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు రాజ్ కుమార్ సింగ్ అతని సహాయకుడు అలీ హసన్ మాధేపురా జిల్లాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. రాజ్ కుమార్ కి సహర్సా- మాధేపుర - సుపాల్ జిల్లాల్లో మూడు యమహా మోటారు బైక్ షోరూమ్ లు ఉన్నాయి. అతను వ్యాపారాన్ని పర్యవేక్షించడానికి ప్రతిరోజూ ఈ మూడు షోరూమ్ లను సందర్శించేవాడు. సహర్సా కళాశాల సమీపంలోని బైజ్నాథ్పూర్ చౌక్ వద్ద రాజ్ కుమార్ ... అలీ హసన్ చేరుకున్నప్పుడు.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వాహనాలను అధిగమించి వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన వెనక కీలకమైన నాయకులు ఉన్నారని.. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ లిపి సింగ్ చెప్పారు.
బాధితులను వెంటనే బాటసారులు రక్షించి చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అలీ హసన్ పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉంది. రాజ్ కుమార్ సింగ్ తో సదరు దుండగులకు ఆస్తి వివాదానికి సంబంధించిన కేసుగా ప్రిమా ఫేసీ ఉంది. అయితే ఇందులో దోపిడీ కోణాన్ని తోసిపుచ్చడం లేదు. మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము.. అని సహర్సా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.