వచ్చే వారంలో థియేటర్ లో రిలీజ్ అవ్వబోతున్న సుశాంత్ చివరి సినిమా
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆకస్మిక మృతితో ఆయన అభిమానులు మరియు సినీ వర్గాల వారు ఇంకా తేరుకోలేక పోతున్నారు. చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా ఆయనకు మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. ఎంఎస్ ధోని సినిమాతో దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత సుశాంత్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇమేజ్ ను దక్కించుకున్నాడు. అలాంటి సుశాంత్ మృతి చెందడం అందరికి ఇంకా షాకింగ్ గానే ఉంది.
ఆయన చివరగా నటించి కరోనా వల్ల విడుదల ఆలస్యం అయిన 'దిల్ బెచారా' ను ఓటీటీ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఆ సినిమాకు రికార్డు స్థాయి వ్యూస్ మరియు రన్ టైం దక్కింది. హాలీవుడ్ సినిమాల రికార్డ్ ను సైతం ఓటీటీలో దిల్ బెచారా దక్కించుకుంది.
సుశాంత్ చివరి సినిమాను థియేటర్లలో చూడలేక పోయాం అంటూ ఆయన అభిమానులు చాలా బాధ పడ్డారు. దిల్ బెచారా సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే వంద కోట్ల సినిమాగా నిలిచేది అంటూ అభిమానులు చాలా నమ్మకంగా అంటున్నారు. ఈ సమయంలోనే దిల్ బెచారాను థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇండియాలో కాదు ఆస్ట్రేలియాలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది.
వచ్చే నెల 8వ తారీకున ఆస్ట్రేలియాలోని పలు ముఖ్య మల్టీప్లెక్స్ లో స్క్రీనింగ్ కు రెడీ అయ్యింది. అక్కడ కరోనా ప్రభావం తక్కువగా ఉండటం వల్ల థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కనుక దిల్ బెచారా సినిమాను అక్కడ విడుదలకు సిద్దం అయ్యారు. దిల్ బెచారా మాత్రమే కాకుండా మరో రెండు హిందీ సినిమాలను కూడా ఆస్ట్రేలియాలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.