మాస్ లుక్ లో రచ్చ చేస్తున్నాడు
తమిళ స్టార్ హీరో సూర్య ఈమద్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడు సినిమాలపై కూడా తమిళ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా మూడు విభిన్నమైన సినిమాలను సూర్య చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం సూర్య 37వ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
విభిన్నమైన నేపథ్యంలో సూర్య ఫ్యాన్స్ ఎలా అయితే సూర్యను చూడాలనుకుంటున్నారో అలా ఈ చిత్రాన్ని ఆనంద్ తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇక ఈ చిత్రం కోసం ఒక ఫోక్ సాంగ్ ను మాస్ మసాలా అంశాతో దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు. ఆ పాట కోసం సూర్య లుంగీ కట్టి, చాలా మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఆ పాట చిత్రీకరణ సందర్బంగా కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. ఆ లీక్ అయిన స్టిల్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు తెర లేపింది.
ఈమద్య కాలంలో సెట్స్ నుండి స్టిల్స్ లీక్ అవ్వడం సర్వ సాదారణం అయ్యింది. అదే విధంగా ఈ సినిమా స్టిల్స్ కూడా లీక్ అయ్యి, సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య ఎ న్‌జీకే చిత్రం విడుదలకు సిద్దం చేస్తూనే మరో వైపు తన 37వ చిత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. వరుసగా చిత్రాలు చేస్తున్న సూర్య 38 మరియు 39 చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.