ధురంధర్ 2 ఎఫెక్ట్.. టాలీవుడ్ లో మార్పు మొదలైందా?
ఇటీవల విడుదలైన ధురంధర్ 2 సినిమా కొత్త చర్చలకు దారితీసింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఆ మూవీలో దర్శకుడు ఆదిత్య ధర్ స్టోరీ నెరేట్ చేసిన విధానం టాలీవుడ్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.;
ఇటీవల విడుదలైన ధురంధర్ 2 సినిమా కొత్త చర్చలకు దారితీసింది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఆ మూవీలో దర్శకుడు ఆదిత్య ధర్ స్టోరీ నెరేట్ చేసిన విధానం టాలీవుడ్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కమర్షియల్ ఫార్ములాతో ముందుకు వెళ్లే తెలుగు ఇండస్ట్రీలో, డాక్యుమెంటరీ స్టైల్ నేరేషన్ కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. అలాంటి కథలను ప్రేక్షకులు అంగీకరించరనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
అయితే ధురంధర్ 2 మూవీ ఆ అభిప్రాయాన్ని ఇప్పుడు కొంతవరకు మార్చేసింది. డాక్యుమెంటరీ తరహా కథనాన్ని కూడా ఎమోషన్స్, ట్విస్టులు యాడ్ చేసి ఆసక్తికరంగా చెప్పవచ్చని సినిమా ద్వారా ప్రూవ్ అయింది. కథలోని నిజమైన సంఘటనల మాదిరి ప్రెజెంటేషన్, రోల్స్ లో డీప్ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆ విధమైన కథనానికి కూడా మార్కెట్ ఉందనే క్లియర్ గా అర్థమవుతోంది.
ఇదే ప్రభావం ఇప్పుడు టాలీవుడ్ లో కనిపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని పెద్ద ప్రాజెక్టులు షూటింగ్ స్టేజ్ లో ఉండగా, ఆ సినిమాల కథలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో రూపొందుతున్న సినిమాల విషయంలో నిర్మాతలు, దర్శకులు మరింత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. కథలు స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే దిశగా ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కొందరు టాప్ ప్రొడ్యూసర్లు తమ దర్శకులకు స్క్రిప్టులు మళ్లీ పరిశీలించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. కథలో నేచురాలిటీ ఉండేలా, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా కనిపించేలా, అలాగే ఎమోషనల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయాలని సూచనలు ఇస్తున్నారని సమాచారం. ముఖ్యంగా డాక్యుమెంటరీలా అనిపించినా కూడా ప్రేక్షకుడిని కట్టిపడేయగల కథనం ఉండాలనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్ లో ఫ్రెష్ నెస్, కథ చెప్పే విధానం కీలకంగా మారుతోంది. ప్రేక్షకులు కూడా కొత్త కథల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, దర్శకులు సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాల స్క్రిప్టుల్లో మార్పులు ప్రారంభమయ్యాయని వినికిడి.
కథలో ఉన్న ట్విస్టులు మరింత స్ట్రాంగ్ గా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఏదేమైనా ధురంధర్ 2 సినిమా ఒక కొత్త దారిని చూపిందని చెప్పవచ్చు. కేవలం కమర్షియల్ ఫార్ములాలకే పరిమితం కాకుండా, కథనంలో ప్రయోగాలు చేయవచ్చనే ధైర్యాన్ని ఫుల్ గా ఇచ్చినట్లు అయింది. ఇది టాలీవుడ్ లో ఫ్యూచర్ లో వచ్చే సినిమాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా మరిన్ని సినిమాలు రూపొందే అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.