హార్డ్ వర్క్‌తో షాక్ ఇస్తున్న రజనీ డైరెక్టర్!
దీంతో కమల్ ఆ స్థానంలో మరో డైరెక్టర్ కోసం అన్వేషించి ఫైనల్‌గా శివకార్తికేయన్ డైరెక్టర్ సిబి చక్రవర్తిని ఫైనల్ చేసుకోవడం తెలిసిందే.;
టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్‌తో `డాన్` మూవీని రూపొందించిన దర్శకుడు సిబి చక్రవర్తి. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎస్.జె. సూర్య, సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో తమిళ ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన సిబి ఎవరూ ఊహించని విధంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ని సొంతం చేసుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు.
కమల్ హాసన్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఓ సోలో మూవీని నిర్మించాలని ప్లాన్ చేయడం దానికి సుందర్ సిని డైరెక్టర్‌గా ప్రకటించడం తెలిసిందే. ఈ మూవీ ప్రారంభం కాకుండానే ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్ సి తప్పుకుని షాక్ ఇచ్చాడు. దీంతో కమల్ ఆ స్థానంలో మరో డైరెక్టర్ కోసం అన్వేషించి ఫైనల్‌గా శివకార్తికేయన్ డైరెక్టర్ సిబి చక్రవర్తిని ఫైనల్ చేసుకోవడం తెలిసిందే. ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్‌ని రజనీ సినిమాకు తీసుకున్నారేంటీ అనే సందేహాలు సర్వత్రా వినిపించాయి.
చాలా మంది చాలా డౌట్‌లు రైజ్ చేశారు కూడా. అయితే ఇవేవీ కమల్ పట్టించుకోకుండా సిబికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి దీనికి సంబంధించిన పనులు ఫాస్ట్‌గా మొదలు పెట్టమని చెప్పారట. ఇంకేముందీ మనోడు జెట్ స్పీడుతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేశాడు. అంతేనా రజనీతో సినిమా కావడంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడట. గెటప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఫైనల్‌గా 83 గెటప్‌లని రెడీ చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలో రజనీ గెటప్‌కే ఇంత హార్డ్ వర్క్ చేస్తే సినిమా విషయంలో సిబి ఏ రేంజ్‌లో శ్రమిస్తాడో అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది.
సినిమా ప్రారంభానికి ముందే రజనీ లుక్ టెస్ట్ కోసం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 83 గెటప్‌లని రెడీ చేయించిన సిబి అందులో మూడింటిని ఫైనల్ చేసి కమల్‌కు పంపించాడట. వాటిలో ఒక గెటప్‌ని కమల్, రజనీ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం `జైలర్ 2` షూటింగ్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీని షూటింగ్ పూర్తయిన తరువాత కమల్‌తో కలిసి చేయనున్న మల్టీస్టారర్‌కు డేట్స్ కేటాయిస్తారు. అదే సమయంలో సిబి చక్రవర్తి డైరెక్షన్‌లో తాను చేయనున్న 173వ ప్రాజెక్ట్‌కు టైమ్ కేటాయిస్తారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సమ్మర్‌లో లాంఛనంగా పట్టాలెక్కించాలని కమల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన సిబి షూటింగ్‌కు సిద్దమవుతున్నట్టుగా చెబుతున్నారు.