ఐదు రోజుల్లో వంద కోట్లు కొల్ల‌గొట్టింది!

మ‌ల‌యాళ సినిమాలు కంటెంట్‌కు ప్ర‌ధాన్య‌త ఇస్తార‌న్న విష‌యం తెలిసిందే. అందుకే బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత పోటీ ఉన్నా మ‌ల‌యాళ సినిమాల‌కు మాత్రం పెద్ద‌గా పోటీ ఉండ‌ద‌ని చిన్న సినిమాలు చాలా సంద‌ర్భాల్లో నిరూపించాయి.;

Update: 2026-03-25 08:13 GMT

మ‌ల‌యాళ సినిమాలు కంటెంట్‌కు ప్ర‌ధాన్య‌త ఇస్తార‌న్న విష‌యం తెలిసిందే. అందుకే బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత పోటీ ఉన్నా మ‌ల‌యాళ సినిమాల‌కు మాత్రం పెద్ద‌గా పోటీ ఉండ‌ద‌ని చిన్న సినిమాలు చాలా సంద‌ర్భాల్లో నిరూపించాయి. రెండంకెల బ‌డ్జెట్‌తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుతాలు సృష్టించాయి. ఊహించ‌ని విధంగా కాసుల వ‌ర్షం కురిపించాయి. ఆర్టిస్ట్‌ల‌తో సంబంధం లేకుండా కంటెంట్ కార‌ణంగానే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుని కాసుల వ‌ర్షం కురిపించాయి.

ఇప్పుడు కూడా ఇదే త‌ర‌హాలో ఓ చిన్న సినిమా సైలెంట్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ ట్రేడ్ వ‌ర్గాల‌ని, మేక‌ర్స్‌ని విస్మ‌యానికి గురి చేస్తోంది. అదే మ‌ల‌యాళ మూవీ `ఆడు 3 వ‌న్ లాస్ట్ రైడ్ పార్ట్ 1`. సూప‌ర్ హిట్ ఫ్రాంఛైజీలో భాగంగా విడుద‌లైన ఈ సినిమా 5 రోజుల్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో పెద్ద స్టార్స్ ఉన్నారా? అంటే అదీ లేదు. పేరున్న డైరెక్ట‌ర్ చేసిన సినిమానా? అంటే అదీ కాదు. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఓ పెద్ద స్టార్ సినిమాల హంగామా సృష్టిస్తోంది.

దేశ వ్యాప్తంగా మార్చి 19న విడుద‌లైన `ధురంధ‌ర్ 2` వ‌సూళ్ల సునామీని సృష్టిస్తుంటే మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో అదే రోజు విడుద‌లైన `ఆడు 3 వ‌న్ లాస్ట్ రైడ్ పార్ట్ 1` కాసుల వ‌ర్షం కురినిస్తోంది. ఈ సినిమా విడుద‌లైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కుని చేరుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. రూ.12 కోట్ల బ‌డ్జెట్‌తో దీన్ని నిర్మించారు. జ‌య‌సూర్య‌, సైజు కురుప్‌, `జైల‌ర్‌` విల‌న్ వినాయ‌క‌న్‌, స‌న్నీవైన్‌, విజ‌య్ బాబు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. భూత వ‌ర్త‌మాన భ‌విష్య‌త్ కాలాల నేప‌థ్యంలో సాగే సినిమాగా దీన్ని రూపొందించారు.

2015, 2017ల‌లో రెండు భాగాలు విడుద‌లై మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. వాటికి మించి పార్ట్ 3 వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో అంతా షాక్‌కు గుర‌వుతున్నారు. `ధురంధ‌ర్ 2` ప్ర‌భంజ‌నం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నా మ‌రో ప‌క్క మాత్రం ఊహించ‌ని విధంగా `ఆడు 3 వ‌న్ లాస్ట్ రైడ్ పార్ట్ 1` వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల్లోనే వంద కోట్ల మార్కుని చేర‌డంతో రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందోన‌ని మ‌ల‌యాళ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News