ఈ విషయంలో 'ధురంధర్' వెరీ వెరీ స్పెషల్!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ధురంధర్ ది రివేంజ్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.;
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ధురంధర్ ది రివేంజ్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సరికొత్త రికార్డుల వేట మొదలు పెట్టిన ఈ మూవీ రిలీజ్ తరువాత ఒక్కో రికార్డుని తుడిచిపెడుతూ సంచలనాలు సృష్టిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇలాగే ఉంటాయిని, భయంకరమైన నిజాలని నిగ్గుతేలుస్తాయని యావత్ ప్రపంచానికి చాటి చెబుతూ సరికొత్త చర్చకు తెరలేపింది. ఇంత వరకు స్పై యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఓ బారియర్స్ ఉండేవి.
అందులోనూ శత్రుదేశాలకు చెందిన వారిని పొగుడుతూ స్వదేశానికి చెందిన సైనికులకు, మరీ ముఖ్యంగా రా కు సంబంధించిన ఏజెంట్‌లని విలన్‌లుగా చిత్రీకరిస్తూ బాలీవుడ్ నుంచి స్పై యాక్షన్ థ్రిల్లర్స్ వచ్చేవి. కానీ వాటన్నింటికీ 'ధురంధర్' చెక్ పెట్టేసి మారుతున్న భారతీయ సినిమా రూపురేఖల్ని సమూలంగా మార్చేసే ప్రయత్నం చేసింది. రియలిస్టిక్ అప్రోచ్‌తో స్పై థ్రిల్లర్స్ ఉండాలని, వాస్తావాలని చెప్పాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా ప్రపంచ సినిమాకు భారతీయ మూవీ పవర్ ఏంటో చూపించి హాలీవుడ్ దిగ్గజాలని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా వసూళ్లని రాబడుతున్న 'ధురంధర్ 2' రానున్న రోజుల్లో అవలీలగా రూ.2000 కోట్ల మైలు రాయిని దాటేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కొంత మంది ఆర్టిస్ట్‌ల పరంగా స్పెషల్ మూవీగా నిలవడం గమనార్హం. చాలా వరకు ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందులో అంతా పేరున్న నటీనటులే ఉంటారు. కానీ 'ధురంధర్' మాత్రం ఈ విషయంలో వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఇందులో నటీంచిన నటీనటులు చాలా వరకు ఎవరో కూడా ఎవరికీ తెలియదు.
చిన్న చిన్న క్యారెక్టర్‌లు వేస్తూ వచ్చిన వారే కావడం విశేషం. పేరున్న నటులకు భారీ పాపులారిటీని తీసుకొచ్చిన 'ధురంధర్' తెరవెనక ఉంటూ సరైన గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మూవీతో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ భారీ పాపులారిటీని సొంతం చేసుకోగా మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా పాపులర్ అవుతున్నారు. వారితో జమాల్ జమాలీగా నటించిన రాకేష్ బేడీ ఒకరు.
టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో కామెడీ ఆర్టిస్ట్‌గా నటించిన రాకేష్ బేడీ ఈ సినిమాతో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. సారా అర్జున్ కూడా ఈ మూవీతో భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకోవడం తెలిసిందే. రణ్‌వీర్‌కు పాక్‌లో ఆశ్రయం ఇచ్చే జూస్ షాప్ ఓనర్ మహమ్మద్ ఆలం క్యారెక్టర్‌లో నటించిన గౌరవ్ గేరా, ఉజైర్ బలోచ్ క్యారెక్టర్‌లో నటించిన దినేష్ పాదోర్, ఐబీ డిప్యూటీ డైరెక్టర్‌గా కనిపించిన మానవ్ గోహీల్, బడేసాబ్ దావూద్ ఇబ్రహీం క్యారెక్టర్‌లో కనిపించి షాక్ ఇచ్చిన డానిష్ ఇక్బాల్, రణ్‌వీర్ సింగ్ రైట్ హ్యాండ్ రిజ్వాన్‌గా కనిపించిన ముస్తఫా అహ్మద్, అర్షద్ పప్పుగా కనిపించిన అశ్విన్‌ధర్, జావెద్ ఖనానీగా నటించిన అంకిత్ సాగర్, కాందహార్ హైజాకర్ జుహూర్ మిస్ట్రిగా కనిపించి ఆకట్టుకున్న వివేక్ సిన్హా, రెహమాన్ వైఫ్ గా సౌమ్యా టాండన్ వంటి వారు ఈ ఒక్క సినిమాతో పాపులర్ కావడం ఓ రికార్డుగా చెబుతున్నారు.