• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భారతీయుడు ముందుకు? కమల్...

భారతీయుడు ముందుకు? కమల్ వెనక్కా?

By - Tupaki Desk
Update: 2017-10-16 04:00 GMT
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన భారతీయుడు సంచలనం సృష్టించింది. అందులో సేనాపతి పాత్రలో కమల్ నటనను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. మేకప్ కు సంబంధించి ఈ మూవీ ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీయాలన్న ప్రతిపాదన వచ్చింది. భారీ బడ్జెట్ తో రెండోపార్ట్ ను గ్రాండ్ గా తీయాలని డైరెక్టర్ శంకర్ అనుకున్నాడు. ఈ సినిమా నిర్మించేందుకు తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుకొచ్చాడు.

అంతా సిద్ధం అనుకుంటున్న టైంలో భారతీయుడు-2 బ్రేక్ పడిందంటూ కోలీవుడ్ లో హీరో సూర్య అభిమానులు ప్రచారం  మొదలెట్టారు. ఈ మూవీలో నటించేందుకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో కమల్ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగించారు. భారతీయుడు-2 సినిమా సూర్య హీరోగా తెరకెక్కుతుందనే రూమర్స్ ఓ రేంజిలో స్ప్రెడ్ చేశారు. ఈ రూమర్స్ తో కోలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది.  కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాని.. డైరెక్టర్ శంకర్ గానీ ఈ విషయంపై పెదవి విప్పలేదు. అలాగని ఈ రూమర్స్ ను ఖండించే ప్రయత్నమూ చేయలేదు.

నటుడిగా కమల్ కెరీర్ లో ఎన్నో గొప్పగొప్ప పాత్రలు చేశాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అలాంటి గొప్ప పాత్రల్లో కచ్చితంగా అగ్రస్థానంలోనే భారతీయుడు పాత్ర ఉంటుంది. ఓ రకంగా సేనాపతి పాత్రకు కమల్ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఒకవేళ కోలీవుడ్ లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం నిజమై చిన్నచిన్న కారణాలకు రెండోపార్ట్ కాదనుకుంటే మాత్రం ఆ నిర్ణయం అంత గొప్ప నటునికి శోభనివ్వదనే చెప్పాలి.
Tags:    
  • Suriya Fans 
  • kamal Haasan 
  • Bharateeyudu 2 Movie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS