• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోల్ రిపోర్ట్: 2020 సౌత్...

పోల్ రిపోర్ట్: 2020 సౌత్ ఇండియా బెస్ట్ హీరో..?

By - Tupaki Desk
Update: 2020-12-25 00:30 GMT
2020 సంవత్సరం సినీ ఇండస్ట్రీ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరగని నష్టాలను చవి చూసింది. గత ఫిబ్రవరిలో వచ్చిన ఈ వైరస్ ప్రభావం ఏడాది చివరి వరకు కొనసాగింది. మొదటి రెండు నెలలు కొన్ని సినిమాలు థియేటర్స్ లో సందడి చేయగా.. మిగతా పది నెలలు హోమ్ థియేటర్స్ లో సినిమాలు సందడి చేశాయి. 2020 ఫస్ట్ క్వార్టర్ లో టాలీవుడ్ లో 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంఠపురంలో' 'భీష్మ' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. మిగతా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల కాబడ్డాయి. సౌత్ ఇండస్ట్రీ మొత్తంగా చూసుకుంటే 2020లో సినిమాల సంఖ్య తక్కువే.. అలానే సక్సెస్ రేట్ కూడా తక్కువే. ఈ ఏడాది విడుదలైన సినిమాల పరంగా సౌత్ ఇండియా బెస్ట్ హీరో అని 'తుపాకీ డాట్ కామ్' పోల్ పెట్టగా క్రింది విధంగా ఫలితాలు వచ్చాయి.

ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అత్యధిక ఓట్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య నటనకు ఓటీటీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ ఏడాది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సూర్య కెరీర్ బెస్ట్ గా నిలిచింది. అందుకే సూర్య ను బెస్ట్ హీరోగా 36.42 శాతం మంది నిర్ణయించారు. ఇక రెండో స్థానంలో 28.84 శాతం ఓట్లతో అల్లు అర్జున్ నిలిచాడు. 'అల వైకుంఠపురంలో' సినిమాతో కెరీర్ బెస్ట్ అందుకున్న బన్నీ.. ఈ సినిమాతో అనేక రికార్డులు తిరగరాసాడు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 16.13 శాతంతో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక 'ట్రాన్స్' సినిమాతో అందరినీ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిన ఫహద్ ఫాసిల్(6.92%) నాలుగో స్థానంలో నిలిచాడు. అలానే 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' తో హిట్ అందుకున్న పృథ్వీరాజ్ 5.23 శాతంతో తర్వాతి ప్లేస్ లో ఉన్నాడు. ఇక 'భీష్మ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్(3.62%).. 'కనులు కనులను దోచాయంటే' హీరో దుల్కర్ సల్మాన్(2.83%) వారిని అనుసరించారు.
Tags:    
  • Suriya 
  • Aakasame Ne Haddura 
  • Sudha Kongara 
  • 2020 South India Best Hero 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS