• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ మూవీకీ ఆమెనే రిపీట్...

పవన్ మూవీకీ ఆమెనే రిపీట్ చేయబోతున్న సూరి

By - Tupaki Desk
Update: 2021-10-27 03:54 GMT
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లా నాయక్‌ సినిమా ను చేస్తున్నాడు. ఆ తర్వాత ఇప్పటికే సగం పూర్తి అయిన హరి హర వీరమల్లు సినిమాను పూర్తి చేయబోతున్నాడు. వెంటనే హరీష్‌ శంకర్ దర్శకత్వంలో సినిమాను కూడా పవన్‌ కళ్యాణ్ చేయబోతున్నాడు. హరీష్‌ శంకర్‌ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ మరో సినిమాను కూడా ప్రారంభించబోతున్నాడు. అదే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా. ఆ సినిమా అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. అందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో ఏజెంట్‌ సినిమాను చేస్తున్న సురేందర్ రెడ్డి ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్ తో సినిమాను చేయబోతున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ వరకు పవన్‌ తో మూవీని పట్టాలెక్కించేలా సురేందర్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడనే సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఏజెంట్‌ సినిమా లో అఖిల్‌ కు జోడీగా సాక్షి వైధ్య ను దర్శకుడు సురేందర్ రెడ్డి చేయిస్తున్నాడు. సాక్షి నటన మరియు ఆమె అందంకు ముగ్దుడు అయ్యాడో లేదా మరేంటో కాని తన తదుపరి సినిమా కు కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. పవన్‌ కళ్యాణ్ కు జోడీగా సాక్షి వైధ్య ను దాదాపుగా కన్ఫర్మ్‌ చేసినట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వరుసగా తెలుగు లో రెండు పెద్ద సినిమాలు పడటంతో ఖచ్చితంగా సాక్షి వైధ్య కెరీర్‌ టర్న్‌ అయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ తో సినిమా అంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమా కనుక సక్సెస్ అయితే టాప్ స్టార్‌ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం. పవన్‌ కళ్యాణ్‌ మరియు సురేందర్‌ రెడ్డిల కాంబో సినిమా ఏంటీ.. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే విషయాలపై మరో రెండు మూడు నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖిల్‌ తో ఏజెంట్‌ ను జెట్‌ స్పీడ్‌ తో ముగించేందుకు షూటింగ్‌ చేస్తున్నాడు. ఏజెంట్‌ పూర్తి అయిన వెంటనే పవన్‌ కళ్యాణ్ తో సినిమాను చేసేందుకు సురేందర్ రెడ్డి ముందస్తుగానే అన్ని రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సురేందర్ రెడ్డికి స్టైలిష్ ఎంటర్‌ టైనర్‌ మూవీస్ ను అందించే దర్శకుడిగా పేరుంది. అందుకే పవన్‌ కళ్యాణ్‌ తో ఈయన చేయబోతున్న సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో.. ప్రేక్షకుల్లో మరియు ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది చివరి వరకు వీరి కాంబో సినిమా వస్తుందేమో చూడాలి.
Tags:    
  • Pspk 
  • Pawan 
  • Surender Reddy 
  • Bheemla Nayak 
  • Harish Shankar 
  • Akhil Akkineni 
  • Agent 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS