ఆ OTT ఫ్లాపైనా మ‌రో కొత్త OTT ప్లానేంటో?

Update: 2020-03-05 05:18 GMT
ఇప్ప‌టికే డిజిట‌ల్ విప్ల‌వం పీక్స్ కి చేరుకుంది. అమెజాన్..నెట్ ప్లిక్స్ లాంటి డిజిట‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌లు అగ్ర‌గామి సంస్థ‌లు గా దూసుకుపోతున్నాయి. వెబ్ సిరీస్ లు.. రియాల్టీ షోల‌తో ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతినిస్తున్నాయి. కొత్త సినిమాల‌ను నెల రోజుల్లోనే డిజిట‌ల్ వేదిక‌పైకి తీసుకొస్తున్నాయి. కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లి జూదం ఆడుతున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే లాభాల్ని ఆర్జిస్తున్నాయి. భ‌విష్య‌త్ అంతా డిజిట‌ల్ దే అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. కాలంతో పాటు ప్ర‌జ‌లు ప‌రుగులు పెట్టాల్సిన స‌న్నివేశం ఉందిపుడు. దానికి అనుగుణంగా అందుబాటులోకి వ‌చ్చిన టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు.

ఇటీవ‌లే మెగా నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ఓటీటీ బిజినెస్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. `ఆహ` పేరుతో డిజిట‌ల్ వేదిక‌ను తెలుగు వారికోసం ప్రారంభించారు. ఈ వేదిక‌పై మెగా హీరోల సినిమాలు ఆన్ లైన్ స్ట్రీమింగుకి రెడీ అవుతున్నాయి. ఇంకా భ‌విష్య‌త్ లో మ‌రెన్నో కొత్త కాన్సెప్ట్ లో ఆహాని అగ్ర స్థాయిలో నిల‌బెట్టాల‌ని ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంతో తాజాగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సురేష్ బాబు..అగ్ర నిర్మాత దిల్ రాజు క‌లిసి సంయుక్తంగా మ‌రో కొత్త ఓటీటీని ప్రారంభించానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త‌మ ఓటీటీ ని వెబ్ సిరీస్ లు..డిఫ‌రెంట్ కాన్సెప్ట్ లతో ప్లాన్ చేస్తున్నారుట‌. అందుకు టాలీవుడ్ హంక్ హీరో రానా కూడా పూర్తి స‌హ‌కారం అందించ‌నున్నాడు.

రానా ఐడియాల‌తో క‌లిసి ఇద్ద‌రు నిర్మాత‌లు ఈ రంగంలోని రాణించాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ప్ర‌స్తుతం గుడ్ ఫ్రెండ్స్ కం అగ్ర‌ నిర్మాత‌లిద్ద‌రు దీనిపై సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే అల్లు ఓటీటీ ఆహా ఆశించినంత స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మ ఫార్ములాని పూర్తి వైవిధ్యంగా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతానికి నేల విడిచా సాము చేయ‌కుండా జాగ్ర‌త్త‌గా త‌మ వ‌ద్ద‌ ఉన్న స్థానిక కంటెంట్ ను ఈ వేదిక‌పైకి తెస్తార‌ట‌. న్యూ ట్యాలెంటును ప్రోత్స‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. నెమ్మ‌దిగా ఓటీటీ నిల‌దొక్కుకున్న త‌ర్వాత పెద్ద రేంజ్ కి రీచ్ అయ్యేలా అప్పుడు ప్లాన్ చేద్దామ‌నుకుంటున్నారుట‌. సినీ నిర్మాణంలో సురేష్ బాబు సుధీర్ఘ‌ అనుభ‌వం.. కంటెంట్ పై దిల్ రాజు జ‌డ్జిమెంట్ కు తిరుగుండ‌దు. లేటెస్ట్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు అడ్వాన్స్ డ్ గా ఎలా ముందుకు వెళ్లాలి? అన్న టెక్నాల‌జీ పై రానాకు మంచి క‌మాండ్ ఉంది. కాబ‌ట్టి ఈ త్ర‌యం ఓటీటీకి స‌క్సెస్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంద‌ని ఆశించ‌వ‌చ్చు. మెగా నిర్మాత‌కు పోటీగా మ‌రో ఓటీటీ సిద్ద‌మ‌వుతుండ‌డం ఆస‌క్తిక‌రం. వాస్త‌వానికి అర‌వింద్-దిల్ రాజు మంచి స్నేహితులు. ఇద్ద‌రు వ్యాపార భాగ‌స్వాములు కూడా. కానీ ఓటీటీ విష‌యంలో అర‌వింద్ ఒక్క‌రే సోలోగా ప్లాన్ చేసి మార్కెట్లోకి వ‌చ్చేసారు. దీంతో దిల్ రాజు..సురేష్ బాబుతో భాగ‌స్వామి అవ్వాల్సి వ‌చ్చింది.


Tags:    

Similar News