సురేష్ బాబు సలహాను మన హీరోలు పాటిస్తారా?
కరోనా నుంచి కోలుకునే టైం వచ్చింది. లాక్ డౌన్ మే 17తో ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి తర్వాత ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రభుత్వాలు, వ్యాపారులు, నిపుణులు ఎన్నో గొప్ప సలహాలు అందిస్తున్నారు.
ప్రస్తుతం కరోనాతో అంతా మూతపడింది. వ్యాపార, వాణిజ్యాలు మళ్లీ కోలుకునే పరిస్థితి లేదు. ప్రధానంగా సినిమా పరిశ్రమ కుదేలైంది. కరోనా భయంతో వచ్చే ఏడాది దాకా జనాలు థియేటర్స్ కు వస్తారన్న గ్యారెంటీ లేదు. దీంతో సినీ పరిశ్రమలో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది.
దీంతో సినీ పరిశ్రమ నష్టనివారణ చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగానే బడా నిర్మాత సురేష్ బాబు తాజాగా హీరోలు, దర్శకులకు సంచలన సలహాను ఇచ్చారు. నటులు, దర్శకులు వారి రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే బావుటుందని ఆయన సలహా ఇచ్చారు.
తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ బాగుపడలాంటి అందరూ పొదుపు చర్యలు పాటించాలి. ఏ వ్యాపారమైనా లాభసాటిగా ఉండదు ఈ కరోనా టైంలో.. లాభాలు లేనప్పుడు నటులు, దర్శకులు కొన్నింటిని వదలుకోవాలని సురేష్ బాబు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావంతమైన సినిమాలు తీసి ఇండస్ట్రీని బతికించాలని సూచించారు.
మరి సినీ పరిశ్రమను బతికించేందుకు తన అనుభవంతో సురేష్ బాబు ఇచ్చిన సలహాను హీరోలు, దర్శకులు పాటిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారా? ఈ బడా నిర్మాత సలహా అమలు అవుతుందా లేదా అన్నది వేచిచూడాలి.