సినిమాను అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది?
గత ఏడాది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'భోబిశ్యోతర్ భూత్' అనే చిత్రం విడుదలైన తర్వాత ప్రదర్శన నిలిపేస్తూ ఉత్వర్వులు జారీ చేయడం జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలు ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, సినిమాను వెంటనే ప్రదర్శణ నిలిపేయాలంటూ థియేటర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం బెంగాల్ లో 48 థియేటర్లలో సినిమా విడుదల అవ్వగా - 46 థియేటర్లలో సినిమాను ప్రదర్శించలేదు. కేవలం రెండు థియేటర్లలో మాత్రం నామమాత్రంగా ప్రదర్శించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న సినిమా బ్యాన్ నిర్ణయంను సవాల్ చేస్తూ సదరు సినిమా నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీం కోర్టు ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. సెన్సార్ అయిన సినిమాను నిలిపేసే అధికారం ప్రభుత్వంకు లేదని - మీరు ఏ అధికారంతో సినిమాను నిలిపేశారో చెప్పమంటూ ప్రభుత్వం తరపు లాయర్ ను ప్రశ్నించగా - ఆయన చెప్పిన సమాధానంకు సంతృప్తి చెందని దర్మాసనం మమతా బెనర్జీ ప్రభుత్వంకు 20 లక్షల జరిమానా విధించడం జరిగింది. శాంతి భద్రతలు కాపాడే పేరుతో వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని, సినిమాలను నిలిపేయడం కూడా వాక్ స్వాతంత్య్రంలో భాగం అంటూ దర్మాసనం పేర్కొంది. ఈ తీర్పుపై చిత్ర నిర్మాత హర్షం వ్యక్తం చేశాడు.