హంద్వారా అమరులకు మహేష్ నివాళ్లు
ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ ఉన్నా కూడా జమ్ము కశ్మీర్ హంద్వారాలో ఉగ్రవాదుల కార్యకళాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జమ్ముకాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదులతో పోరులో భారత సైన్యంకు చెందిన కల్నల్.. మేజర్.. ఇద్దరు జవాన్ లు ఇంకా ఒక ఎస్‌ఐలు మృతి చెందారు. స్థానికుల ప్రాణాలు కాపాడటంతో పాటు ఉగ్రవాద కార్యక్రమాలపాలను అరికట్టే క్రమంలో వీరు వీర మరణం పొందరు. హంద్వారా అమరులకు ప్రముఖులు నివాళ్లు అర్పించారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హంద్వారా ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు స్పందిస్తూ.. దేశాన్ని కాపాడుతున్న మన సైనికుల సంకల్పం చాలా దృడమైనది. వారు చాలా ధైర్యవంతులు. వారి సంకల్పం మరియు ధైర్యం ఎప్పటికి సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నివాళ్లు అర్పిస్తున్నాను.
హంద్వారా అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయం లో వారు ధైర్యంగా ఉండాలని వారికి దేవుడు మనో ధైర్యం ప్రసాధించాలని ప్రార్ధిస్తున్నాను. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు.