అమ్మమ్మతో మహేష్.. వైరల్ గా మారిన రేర్ పిక్..!

Update: 2021-06-26 03:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్రారంభం నుంచీ జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఎన్నో టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మహేష్.. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించారు. ఇక పర్సనల్ లైఫ్ - ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలన్స్ చేసే అతి తక్కువ మంది హీరోలలో మహేష్ ఒకరు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో సమయం గడుపుతుంటారు. కుటుంబానికి మహేష్ ఇచ్చే ప్రాధాన్యత ఎంతో సోషల్ మీడియాలో ఆయన్ని ఫాలో అయ్యేవారికి అర్థం అవుతుంది.

తాజాగా మహేష్ కి సంభందించిన ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది సూపర్ స్టార్ అరుదైన పిక్స్ లో ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ తన గ్రాండ్ మదర్ దుర్గమ్మతో కలిసి ఉన్న ఫోటో ఇది. ఇందులో మహేష్ సింపుల్ గా హాఫ్ హ్యాండ్స్ - షర్ట్ బ్లూ జీన్స్ ధరించి చేతులు వెనక్కి పెట్టుకొని తన గ్రాండ్ మదర్ పక్కన నిలబడి ఉన్నాడు. ఈ రేర్ పిక్ చూసిన మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ చిత్రాన్ని చేయనున్నారు. ఇదే క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు.
Tags:    

Similar News