గోవా బీచ్‌లో సారా టెండూల్కర్ చేతిలో ఆ బాటిల్ ఏమిటో?
సచిన్ టెండూల్కర్ నిజానికి దశాబ్ధాలుగా చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించినా కానీ, ఏనాడూ ఖైనీ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను కానీ, మద్యం కంపెనీలను కానీ ప్రోత్సహించలేదు.;
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఏం చేసినా అది సెన్సేషన్ గా మారుతోంది. నేటితరం బాలీవుడ్ కథానాయికలకు తీసిపోని అందం, చురుకైన వ్యక్తిత్వం, హుందాతనంతో సారా ఎప్పుడూ హృదయాలను గెలుచుకుంటోంది. టీమిండియా స్టార్ క్రికెటర్ గిల్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న ప్రచారంతో సారా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవల కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించిన సారా వెల్‌నెస్ స్టూడియోల నిర్వహణలోను బిజీ అవుతుండడం ఆసక్తిని కలిగిస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం వేళ, గోవాలో విహారయాత్రలో ఉన్నప్పుడు సారా ఒక వివాదంలో చిక్కుకున్నారు. గోవా వెకేషన్ నుంచి వైరల్ అయిన ఒక వీడియో ట్రోలింగ్‌కు కారణమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సారా తన స్నేహితులతో కలిసి చేతిలో ఒక బాటిల్‌తో నడుస్తూ కనిపించారు.. అది బీర్ బాటిల్ అయి ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సారా చేతిలో ఉన్నది మద్యం బాటిలేనా కాదా? అన్నది ఎవరికీ తెలీదు. కానీ నెటిజన్లు సారా తండ్రి టెండూల్కర్ పొగాకు, మద్యం వంటి వాటికి వ్యతిరేకిగా ఉన్నందున ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సచిన్ టెండూల్కర్ నిజానికి దశాబ్ధాలుగా చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించినా కానీ, ఏనాడూ ఖైనీ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను కానీ, మద్యం కంపెనీలను కానీ ప్రోత్సహించలేదు. వాటికి ప్రచారం ఏనాడూ చేయలేదు. అతడు ఓ సందర్భంలో మాట్లాడుతూ ``నేను ఎప్పటికీ మద్యం, పొగాకును ప్రోత్సహించను`` అని అన్నారు. తన తండ్రికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఇలా చేస్తున్నానని సచిన్ చెప్పారు. నేను ఒక రోల్ మోడల్‌ని అని, నేను చేసే పనులను చాలా మంది అనుసరిస్తారని నాన్నగారు నాకు చెప్పారు. అందుకే నేను పొగాకు ఉత్పత్తులను, మద్యాన్ని ఎప్పుడూ ప్రచారం చేయలేదు! అని సచిన్ చెప్పారు. ఇప్పుడు ఈ విషయాలన్నిటీనీ గుర్తు చేస్తూ సారా టెండూల్కర్ ని నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.
సచిన్ టెండూల్కర్ పొగాకు, సిగరెట్లు, పాన్ మసాలా, మద్యం వంటి వాటిని ఎప్పుడూ ప్రచారం చేయలేదు. కానీ అతను తన కుమార్తె సారా టెండూల్కర్‌ను వ్యసనాలకు దూరంగా ఉంచలేకపోయాడు! అని ఒక నెటిజన్ అన్నారు. చాలా మంది సచిన్ పెంపకాన్ని నిందించేందుకు ప్రయత్నించారు.
అయితే సారా టెండూల్కర్ వ్యవహారంతో టెండూల్కర్ పేరును ముడి వేయడం సరికాదని కొందరు సూచించారు. తన తండ్రి నైతిక ఒప్పందానికి ఆమె బాధ్యురాలు కాదు. నిజమైన సమస్యలను విస్మరించి, యువతుల జీవితాలపై పెత్తనం చెలాయించడమే ప్రజల్లోని అసలైన వ్యసనం! అని మరో నెటిజన్ స్పందించారు. టెండూల్కర్ ని దూషించడం సరికాదని అన్నారు. అయితే సారా చేతిలో ఉన్న బాటిల్ మద్యం బాటిలేనా కాదా? అన్నదానికి ఎలాంటి ధృవీకరణా లేదు. దీనిపై సారా స్పందిస్తుందేమో చూడాలి.