45 ఏళ్లుగా ఎప్పుడూ అది మాన‌లేదు

అక్కినేని నాగార్జున గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ గా కొన్ని ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోగా కొన‌సాగుతున్న నాగార్జునకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది.;

Update: 2026-01-01 09:17 GMT

అక్కినేని నాగార్జున గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ గా కొన్ని ద‌శాబ్ధాలుగా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోగా కొన‌సాగుతున్న నాగార్జునకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్ప‌టికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో ఆడియ‌న్స్ ను అల‌రిస్తున్న నాగార్జునకు ప్ర‌స్తుతం 66 ఏళ్లు. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న కుర్ర హీరోల‌కు పోటీ ఇచ్చే అందంతో క‌నిపిస్తున్నారు.

త‌న ఫిట్‌నెస్ తో యంగ్ హీరోల‌కు సైతం గ‌ట్టి పోటీని ఇచ్చే నాగార్జున రీసెంట్ గా త‌న ఫిట్‌నెస్ మంత్రాన్ని వెల్ల‌డించారు. అంత ఎక్కువ వ‌య‌సులో కూడా నాగ్ ఇంత అందంగా ఎలా ఉన్నారా అని ఎంతోమంది అత‌ని సీక్రెట్ గురించి తెలుసుకోవాల‌ని తెగ ఆలోచిస్తుంటారు. అయితే నాగ్ తాజాగా త‌న ఫిట్‌నెస్ సీక్రెట్ ను రివీల్ చేసి అంద‌రికీ క్లారిటీ ఇచ్చారు.

ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన నాగ్

త‌న ఫిట్‌నెస్ సీక్రెట్ కేవ‌లం టైమ్ కు తిన‌డం మాత్ర‌మేన‌ని రీసెంట్ గా నాగ్ త‌న హెల్త్ సీక్రెట్ ను చెప్పారు. తాను రోజూ టైమ్ కు తింటాన‌ని, ఎప్పుడూ క‌డుపు మాడ్చుకొని డైట్ చేయ‌న‌ని, అన్నీ తింటాన‌ని, కానీ టైమ్ కు తింటాన‌ని, వాటితో పాటూ ప్ర‌తీ రోజూ క‌చ్ఛితంగా జిమ్ చేస్తాన‌ని, 45 ఏళ్లుగా హెల్త్ బాలేన‌ప్పుడు త‌ప్ప మిగిలిన అన్ని రోజులు జిమ్ చేశాన‌ని, అదే త‌న ఫిట్‌నెస్‌కు సీక్రెట్ అని నాగ్ రివీల్ చేశారు.

ఈ ఇయ‌ర్ చాలా హ్యాపీగా ఉన్నా

తానెప్పుడూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోన‌ని, అన్ని విష‌యాల‌నూ పాజిటివ్ గా తీసుకుంటానని, ఎలాంటి ప్రాబ్ల‌మ్ వ‌చ్చినా ఎప్పుడూ డ‌ల్ అవ‌న‌ని, ప్ర‌స్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని, ఇద్ద‌రు కొడుకుల‌కు పెళ్లి చేశాన‌ని, వాళ్ల‌ను చూస్తుంటే త‌న‌కెంతో ఆనందంగా ఉంద‌ని నాగ్ చెప్పారు. ఏ ఏజ్ లో అయినా ఫిట్ గా ఉండ‌టానికి క్ర‌మ‌శిక్ష‌ణ‌, హెల్తీ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని నాగ్ వెల్ల‌డించారు.

Tags:    

Similar News