సూపర్ స్టార్ లేడీ ఫ్యాన్ ఆత్మహత్య
సూపర్ స్టార్ మహేష్ బాబుకు డై హార్డ్ ఫ్యాన్ అయిన 23 ఏళ్ల పద్మజ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పలు సినిమాలు మరియు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన పద్మజకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. మహేష్ బాబు అభిమానులకు పద్మజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఒక సారి మహేష్ బాబు కోసం చేతిలో కర్పూరం వెలిగించుకున్న పద్మజ తన అభిమానాన్ని ఆ విధంగా చూపించింది.
ప్రస్తుతం ట్విట్టర్ లో అప్పటి వీడియో వైరల్ అవుతుంది. తమ తోటి అభిమాని చనిపోవడం తో మహేష్ బాబు ఫ్యాన్స్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్ ఐ పీ పద్మజ అంటూ హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేస్తున్నారు. పద్మజ ఆత్మ హత్యకు గల కారణాలు ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. పద్మజ కొన్నాళ్ల క్రితం భర్త నుండి విడిపోయింది. కొడుకు తో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. ఇప్పుడు ఏమైందో కాని పద్మజ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలియజేశారు.