• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ అభిమానిని-...

ఎన్టీఆర్ అభిమానిని- సూప‌ర్‌ స్టార్ కృష్ణ‌

By - Tupaki Desk
Update: 2018-12-22 04:28 GMT
ఆరోజుల్లో న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ - సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌ధ్య పోటీ ఉండేద‌ని అభిమానులు చెబుతుంటారు. నువ్వా .. నేనా? అంటూ సినిమాలు తీసేందుకు - న‌టుడిగా పైచేయి సాధించేందుకు కృష్ణ  పెద్దాయ‌న‌తో పోటీప‌డేవార‌ని - ఆ క్ర‌మంలోనే ఆ పోటీ ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన పోటీకి తెర తీసేద‌ని చెప్పుకునేవారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ స్పోర్టివ్ గా కెరీర్ ని మ‌లుచుకునేందుకు ఎంతగానో పోటీప‌డ్డారు. అనుకున్న‌ది సాధించారు. అప్ప‌ట్లోనే కృష్ణ నిర్మాత‌గా మారి `సింహాస‌నం` లాంటి భారీ చిత్రం తీయ‌డానికి - ఆ సినిమాతో బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు బ‌ప్పీల‌హ‌రిని బ‌రిలో దించేందుకు కార‌ణం కూడా ఈ పోటీనే అని చెబుతారు. అయితే అందుకు సింబాలిక్ గానే పెద్దాయ‌న‌పై సూప‌ర్‌ స్టార్ త‌న అభిమానం చాటుకున్నారు `ఎన్టీఆర్‌- క‌థానాయ‌కుడు` ఆడియో వేదిక‌పై.

సూపర్ స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ నేను చిన్నప్పట్నుంచి రామారావుగారి అభిమానిని. డిగ్రీ పూర్తయిన తర్వాత రామారావుగారిని కలవాలనే మద్రాసు వెళ్లాను. వారిని కలిసి `మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమాల్లో నటించాలనే ఆస‌క్తి ఉంది. మీ పిక్చర్స్‌ లో ఏదైనా వేషం ఇవ్వండి`` అని అడిగాన‌ని తెలిపారు. దానికి ఆయన `నువ్వింకా చిన్న కుర్రాడిగానే ఉన్నావ్‌. రెండు - మూడేళ్లు అగితే నువ్వు పనికొస్తావ్‌. డెఫనెట్‌ గా వేషం ఇస్తాను అన్నార‌``ని తెలిపారు.

ఆ త‌ర్వాత‌నే కృష్ణ హీరోగా ఆదుర్తి సుబ్బారావు `తేనె మనుషులు` చిత్రంతో హీరోని చేశారు. హీరో అయ్యి ఆ తర్వాత ఐదో సినిమా `స్త్రీ జన్మ`లో రామారావుగారితో నటించే అవకాశం కలిగింద‌ని - ఆ తర్వాత నిలువుదోపిడి - విచిత్ర కుటుంబం సినిమాలు చేశాన‌ని - అందులో మూడు సినిమాలు హిట్‌ అయ్యాయ‌ని కృష్ణ తెలిపారు. ఆ తర్వాత పండంటి కాపురం 100 రోజుల వేడుక‌కు రామారావుగారు వచ్చారు. నేను స్టేజ్ పైనే రామారావుగారితో సినిమా చేయాలనుందని అనౌన్స్‌ చేస్తానని అంటే.. `త‌ప్ప‌కుండా బ్రదర్‌... నీ పిక్చర్‌ లో నేను యాక్ట్‌ చేస్తాను. క‌థ చూసుకోండి``అన్నారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సబ్జెక్ట్‌ వినిపిస్తే చాలా బావుందని - ఒకే షెడ్యూల్‌ లో సినిమాను పూర్తి చేశారు. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఆయనతో నేను చేసిన సినిమాలన్నింటిలో తమ్ముడిగానే నటించాను. బాలకృష్ణ ఈ ఫంక్షన్ కు పిలవడానికి వచ్చి ఆయన వేసిన గెటప్స్ ను ఫోన్ లో నాకు చూపించారు. 100 శాతం రామారావుగారిలాగానే బాలకృష్ణ కనిపించారు. `యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు` -`యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు` సినిమాలు ఘన విజయాలు సాధించి బాలకృష్ణగారికి గొప్ప పేరుని తీసుకురావాలి`` అన్నారు.


Tags:    
  • Superstar Krishna 
  • NTR Biopic Audio Launch 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS