• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్ కృష్ణ.....

సూపర్ స్టార్ కృష్ణ.. నాలుగు తీరని కోరికలు..!

By - Tupaki Desk
Update: 2022-11-15 11:23 GMT
సూపర్ స్టార్ కృష్ణ అకాల మరణం సినీ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. ఉదయం విషయం తెలిసిన దగ్గర నుంచి ఘట్టమనేని అభిమానులు సూపర్ స్టార్ పై తమ అభిమానం చూపిస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబుకి మనో ధైర్యం చెబుతూ సపోర్ట్ చేస్తున్నారు. అనారోగ్యం అని తెలిసినా ఆయన పోరాట పటిమ తెలిసిన ప్రతి ఒక్కరు మళ్లీ మాములు మనిషిగా తిరిగి వస్తారని అనుకున్నారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సరే ఆయన్ని కాపాడలేకపోయారు.

కృష్ణ గారి సినీ ప్రస్థానం లో ఎన్నో హిట్లు.. సూపర్ హిట్లు ఉన్నాయి. తేనేమనసులు సినిమా నుంచి శ్రీశ్రీ వరకు మొత్తం 350 కి పైగా సినిమాల్లో నటించారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని జోనర్ లు టచ్ చేసిన హీరో ఆయన ఒక్కరే అని చెప్పొచ్చు. అయితే ఆయన ఇంకా చేయాలనుకున్న చూడాలనుకున్న నాలుగు కోరికలు మాత్రం తీరకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

ఇంతకీ ఆ కోరికలేంటి అంటే మనవడు గౌతం కృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నారట మహేష్. ఆల్రెడీ మహేష్ తో వన్ నేనొక్కడినే సినిమాలో గౌతం తెరంగేట్రం చేశాడు. మనవడితో తను కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకున్నారట కృష్ణ. అంతేకాదు మంచి కథ వస్తే మహేష్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నారు అది కూడా జరగలేదు.

ఇక మహేష్ ని తెర మీద జేమ్స్ బాండ్ గా చూడాలని ఆశపడ్డారు కృష్ణ. ఆ కోరిక కూడా నెరవేరలేదు. కెరీర్ మొదట్లోనే జేమ్స్ బాండ్ సినిమాలు చేసి అదరగొట్టిన కృష్ణ తన నట వారసుడు మహేష్ కూడా ఆ పాత్రలో జేమ్స్ బాండ్ గా చూడాలని అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటి కథ రాకపొవడంతో మహేష్ చేయలేదు. అయితే రాజమౌళి డైరక్షన్ లో మహేష్ చేస్తున్న సినిమా కథ జేమ్స్ బాండ్ తరహాలోనే ఉంటుందని అంటున్నారు.   

కృష్ణ చేయాలనుకున్న మరో ఆసక్తికరమైన పాత్ర శివాజి. చంద్రహాస సినిమాలో కొద్దిసేపు శివాజి గెటప్ లో కనిపించిన కృష్ణ పూర్తిస్థాయిలో ఛత్రపతి శివాజి సినిమా చేయాలని అనుకున్నారు. అల్లూరి సీతారామరాజు తర్వాత మహారథితో ఈ కథా చర్చలు కూడా చేశారు. అయితే స్క్రిప్ట్ దశలోనే మత కలహాలు వచ్చే అవకాశం ఉందని ఆ ప్రాజెక్ట్ ని వద్దనుకున్నారు. శివాజి కథ చేయాలనుకున్న కృష్ణ కోరిక నెరవేరలేదు.

అంతేకాదు ఓ రియాలిటీ షో హోస్ట్ గా కూడా చేయాలని అనుకున్నారట సూపర్ స్టార్. బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి టైప్ లో తెలుగులో రియాలిటీ షో చేస్తే బాగుంటుందని. హోస్ట్ గా తను చేయడానికి రెడీ అని అప్పట్లో చెప్పారట. కానీ అది ఎవరు చేయలేదు. ఇలా కృష్ణ గారు చేద్దాం అనుకుని చేయలేని కొన్ని కోరికలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కృష్ణ చేయలేని ఈ ప్రాజెక్ట్ లను మహేష్ చేస్తాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • SuperStarKrishna 
  • Cineindustry 
  • Maheshbabu 
  • TeluguCinema 
  • AlluriSeetaramaraju 
  • GauthamKrishna 
  • 1Nenuokadine 
  • JamesBond 
  • Shivaji 
  • RelaityShowHost 
  • MovieNews 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS