పుట్టిన రోజున అభిమానులను ఇంట్లోకి ఆహ్వానిస్తున్న సూపర్‌ స్టార్

Update: 2020-11-01 05:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఇళ్లలో షారుఖ్‌ ఖాన్‌ ఇంటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. రెండు మూడు ఏళ్ల క్రితమే షారుఖ్‌ ఖాన్‌ ఇళ్లు మన్నత్‌ విలువను 200 కోట్ల రూపాయలుగా రియల్‌ వ్యాపారులు అంచనా వేశారు. ఆ ఇంటిని ఇంకా ఎంతో అద్బుతమైన ఇంటీరియర్‌ తో మరెన్నో మెరుగులు పెట్టి మరింత అందంగా షారుఖ్‌ దంపతులు చేసుకున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మన్నత్‌ అసలు ఎలా ఉంటుందో ఒక్కసారి అయినా చూడాలని కోరుకుంటూ ఉంటారు. బయట నుండే ఇంద్ర భవనం మాదిరిగా కనిపించే మన్నత్‌ లోపల అంతకు మించి ఉంటుందనే అభిప్రాయం ఉంది. అలాంటి మన్నత్‌ లోకి అభిమానులను తన పుట్టిన రోజున తీసుకు వెళ్లేందుకు షారుఖ్‌ సిద్దం అయ్యాడు.

ప్రతి ఏడాది నవంబర్‌ 2న షారుఖ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఇంటి వద్ద వేలాది మంది అభిమానులు గుమ్మి గూడుతారు. ఈసారి కూడా అభిమానులు భారీ ఎత్తున మన్నత్‌ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. అయితే తన ఇంటి వద్దకు రాకుండానే ఎవరి ఇంట్లో వారు ఉండి తనను కలుసుకోవడంతో పాటు మన్నత్‌ లోకి అడుగు పెట్టేందుకు షారుఖ్‌ ఏర్పాట్లు చేశాడు. తన పుట్టిన రోజున మన్నత్‌ ను తన అభిమానులకు వర్చువల్‌ రియాల్టీ ద్వారా చూపించేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించాడు.

వీఆర్‌ సెట్‌ ను ఉపయోగించి మన్నత్‌ ను అనువనువు 360 డిగ్రీలు తిరిగి చూసే వీలును షారుఖ్‌ కల్పించబోతున్నాడు. మన్నత్‌ మొత్తంను కూడా వీఆర్‌ ఎక్కూప్‌ మెంట్‌ ను ఉపయోగించి చూడవచ్చు. ఇది నిజంగా అభిమానులకు చాలా ప్రత్యేకమైన బహుమానంగా చెప్పుకోవచ్చు. కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా మన్నత్‌ ఎలా ఉంటుందో చూడాలని కోరుకుంటున్నారు. వారంత కూడా రేపు షారుఖ్‌ పుట్టిన రోజు సందర్బంగా మన్నత్‌ టూర్‌ వేసే అవకాశం ఉంది. ఇక రేపు షారుఖ్‌ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకంగా సినిమా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News