ఫొటోటాక్‌ : సూపర్‌ స్టార్‌ హాలీవుడ్‌ లుక్‌

Update: 2020-11-17 05:00 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఫొటోలను నమ్రత రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ వస్తోంది. ఇటీవల దుబాయి హాలీడే ట్రిప్‌ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరో ఫొటోను నమ్రత షేర్‌ చేసింది. ఈ ఫొటోకు అభిమానులు హాలీవుడ్‌ హీరో లా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. రెగ్యులర్‌ గా కనిపించే కంటే మహేష్ బాబు ఈమద్య భిన్నంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన హెయిర్‌ స్టైల్‌ మారింది. ఇక ఈ ఫొటోలో అత్యంత స్టైలిష్‌ గా గాగుల్స్‌ ధరించి రాయల్‌ లుక్‌ లో కనిపించిన సూపర్‌ స్టార్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు.

తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఎవరు ఇలా కనిపిస్తారు అంటూ నమ్రత ఈ ఫొటోను షేర్‌ చేసి కామెంట్‌ పెట్టింది. ఎయిర్‌ పోర్ట్‌ లో తెల్లవారు జామున నమ్రత తీసిన ఈ ఫొటో రెండు మూడు గంటల్లోనే వైరల్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో వేలకు పైగా షేర్స్‌ లక్షల్లో లైక్స్‌ వచ్చాయి. నమ్రత ఈ ఫొటోను రెండు గంటల క్రితం షేర్‌ చేసింది. ఇంతలోనే 85 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. నెటిజన్స్‌ అంతా నిద్రలోంచి లేస్తే అంటే మరో రెండు గంటల్లో ఈ ఫొటోకు రెండు లక్షలకు పైగా లైక్స్‌ రావచ్చు అంటున్నారు. సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్‌ బాబు లుక్‌ మార్చుతున్నాడు. అందుకే కాస్త జుట్టు పెంచుతున్నాడు.
Tags:    

Similar News