సన్నీలియోన్ బాహుబలి చూసి..
సన్నీ లియోన్ ఏంటి.. ఇప్పుడు బాహుబలి చూడటం ఏంటి అంటారా? మరీ ఇంత ఆలస్యం ఎందుకైందో సన్నీనే అడగాలి మరి. ‘బాహుబలి: ది బిగినింగ్’ గత ఏడాది జులై 10న విడుదలైతే.. ఇన్నాళ్లకు సన్నీ ఆ సినిమా చూసి నిన్న రాత్రి ట్విట్టర్లో మెసేజ్ పెట్టింది. ఎట్టకేలకు ‘బాహుబలి’ చూశానని.. అద్భుతంగా ఉందని.. చివర్లోకి వచ్చేసరికి ఇది నిజమా అన్నట్లు ముగిసిందని.. ఇక రెండో భాగం కోసం వెయిట్ చేస్తున్నానని వ్యాఖ్యానించింది సన్నీ.
ఇప్పటిదాకా ‘బాహుబలి’కి ఎన్ని కాంప్లిమెంట్స్ అయినా వచ్చి ఉండొచ్చు కానీ.. పోర్న్ సినిమాలతో వందల దేశాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ప్రపంచ ప్రఖ్యాత సన్నీ లియోన్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం ప్రత్యేకమైంది. కాబట్టి.. ఛీర్స్ జక్కన్న అండ్ కో. మరి రెండో భాగంతో సన్నీని జక్కన్న ఇంకెంతగా మెప్పిస్తాడో.. ఇంకెలాంటి కాంప్లిమెంట్స్ తీసుకుంటాడో చూద్దాం.
ఇంతకీ సన్నీ లియోన్ ఈ టైంలో ‘బాహుబలి’ ఎలా చూసిందన్నదే డౌటు. ఇప్పుడైతే ఇండియాలో ఎక్కడా ‘బాహుబలి’ ఆడుతున్నట్లు లేదు. మరి ‘బాహుబలి’ హిందీ నిర్మాత కరణ్ జోహార్ కు చెప్పి స్పెషల్ షో వేయించుకుని చూసిందా.. లేక టీవీలో వస్తుంటే చూసిందా.. లేక కొంపదీసి పైరసీలో ఏమైనా చూసేసిందా..? ఎలాగైతేనేం సన్నీ ‘బాహుబలి’ చూసింది.. కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు సంతోషిద్దాం.