• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌న్నీ బ‌యోపిక్ టీజ‌ర్...

స‌న్నీ బ‌యోపిక్ టీజ‌ర్ వ‌చ్చేసింది

By - Tupaki Desk
Update: 2018-05-13 06:06 GMT
ఒక పోర్న్ స్టార్ కు సెల‌బ్రిటీ స్టేట‌స్ రావ‌టం.. బాలీవుడ్ సినిమాల్లో వ‌రుస‌పెట్టి ఛాన్సులు వ‌చ్చేయ‌టం.. మిగిలిన భార‌తీయ భాషా చిత్రాల్లో ఆమెకు అవ‌కాశాలు వెల్లువ‌లా రావ‌టం స‌న్నీ లియాన్ కు మాత్ర‌మే సాధ్య‌మేమో. క‌ర‌ణ్ జిత్ కౌర్ వోహ్రా అంటే ఏ ఒక్క‌రికి గుర్తుకు రాని స‌న్నీ అస‌లు పేరు ఇది. ఇప్పుడా పేరుతోనే ఆమె బ‌యోపిక్ వ‌చ్చేస్తోంది. కాకుంటే వెండితెర మీద కాదు.. వెబ్ సిరీస్ గా.

భార‌తీయ మూలాలున్న స‌న్నీ ఎందుకు పోర్న్ స్టార్ గా మారింది?  ఆమె కాలేజీ జీవితం.. ఏ సంద‌ర్భంలో ఆమె అడ‌ల్ట్ స్టార్ అయ్యేందుకు మొగ్గు చూపింది లాంటి అంశాలు ఈ బ‌యోపిక్ లో ఉండ‌నున్నాయి. అయితే.. ఈ బ‌యోపిక్ లో స‌న్నీ పాత్ర‌ను ఎవ‌రు చేస్తున్నారంటే.. ఇంకెవ‌రు స‌న్నీనే.

బిగ్ బాస్ సీజ‌న్ 5లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒక్క‌సారి దేశ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితురాలిగా మారింది. బిగ్ బాస్ చేస్తే స‌ల్మాన్ ఖాన్ ను క‌లిసే అవ‌కాశం వ‌స్తుంద‌ని.. ఆయ‌న ఆటోగ్రాఫ్ తీసుకోవ‌చ్చ‌న్న ఉద్దేశంతో భార‌త్‌లోకి అడుగుపెట్టిన స‌న్నీకి ఊహించ‌లేని రీతిలో అద‌ర‌ణ రావ‌టం.. అవ‌కాశాలు వ‌చ్చేయ‌టంతో పోర్న్ స్టార్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో స‌న్నీ స్టార్ స్టేట‌స్ న సొంతం చేసుకోవ‌టంతో పాటు.. సుప‌రిచితురాలిగా మారిపోయింది. సెక్సీ రోల్స్‌.. ఐటెమ్ సాంగ్స్ తో పాటు.. ఏ అవ‌కాశం ద‌క్కినా వ‌దులుకోకుండా త‌న స‌త్తాను చాటుతోంది.

ఇలాంటి వేళ‌.. తాజాగా ఆమె చేస్తున్న బ‌యోపిక్ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది.ఈ టీజ‌ర్ చూసిన వారికి స‌న్నీ జీవితంలో పోరాటం ఎంత ఉందో తెలీటంతో పాటు.. ఒక సింఫుల్ గాళ‌.. పోర్న్ స్టార్ గా ఎలా రూపాంతరం చెందిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. స్కూల్ డేస్ నుంచి అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని చూపించ‌నున్నారు. నాటి ప‌రిస్థితుల్ని వివ‌రించ‌నున్నారు.

అయితే.. వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూసేయటం సాధ్యం కాదు. జీ5 ఛాన‌ల్ లో మాత్ర‌మే ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉండ‌నుంది. వారు కోరినంత మొత్తాన్ని చెల్లించి మాత్ర‌మే దీన్ని చూసే వీలుంది. స‌న్నీ లైఫ్ ను సినిమాగా తీసి ఉంటే బాగుంటుంద‌న్న వాద‌న వినిపించినా.. వెబ్ సీరీసే స‌రి అంటోంది స‌న్నీ. ఎందుకంటే.. కొన్ని సీన్లు సినిమాగా చేయ‌టం సాధ్యం కాద‌ని.. అదే వెబ్ సిరీస్ అయితే అలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చెబుతోంది. నెట్ లో వెబ్ సిరీస్ లు.. న‌చ్చిన షోల‌ను చూసే వారికి స‌న్నీ బ‌యోపిక్ ఆక‌ర్షించ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. స‌న్నీ అభిమానులు.. ఆమె బ‌యోపిక్ ను వెబ్ సిరీస్ గా చూసేందుకే ఇష్ట‌ప‌డ‌తార‌న్న మాట వినిపిస్తోంది.

Click Here For Teaser

Tags:    
  • Karenjit Kaur Teaser 
  • Sunny Leone Biopic Teaser 
  • Zee5 TV Channel 
  • Telugu News 
  • Web Series 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS