సునీల్ ఫేట్ మార్చిన పుష్ప… ఏకంగా 4 పాన్ ఇండియా సినిమాలతో
కమెడియన్ గా కెరియర్ ప్రారంభించి తరువాత హీరోగా టర్న్ తీసుకొని టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగించిన నటుడు సునీల్. స్టార్ కమెడియన్ గా ఎన్నో హిట్ సినిమాలలో భాగం అయిన సునీల్ మర్యాద రామన్న సినిమాతో రాజమౌళి దర్శకత్వంలో హీరోగా సూపర్ హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. పూలరంగడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తరువాత కమర్షియల్ జోనర్ లో కామెడీ, యాక్షన్ మిక్స్ చేసే కథలతో సినిమాలు చేసిన సునీల్ కి మళ్ళీ పూలరంగడు స్థాయి సక్సెస్ పడలేదు.
దీంతో హీరోగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న సునీల్ కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఆ తరువాత రవితేజ డిస్కో రాజాలో విలన్ గా చేశాడు. అయితే పుష్ప సినిమాలో సునీల్ చేసిన పవర్ ఫుల్ విలనీ రోల్ అతని ఇమేజ్ ని అమాంతం మార్చేసింది. అందులో సునీల్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ లో ఈ షేడ్స్ కూడా ఉన్నాయా అనేలా అద్బుతమైన విలనిజం చూపించాడు. ఈ మూవీ తర్వాత సునీల్ కి అవకాశాలు అమాంతం పెరిగిపోయాయి.
ఓ వైపు హీరో తరహా పాత్రలతో చిన్న సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు. మరో వైపు విలనీగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇక పుష్ప సినిమా క్రేజ్ తో ఇప్పుడు సునీల్ కోలీవుడ్ లో కూడా వరుస అవకాశాలని సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ సినిమాలో పవర్ ఫుల్ విలనీ రోల్ లోనే సునీల్ కనిపిస్తున్నాడు. తాజాగా సునీల్ లుక్ కి సంబందించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. శివకార్తికేయన్ మావీరన్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు. అలాగే కార్తి పీరియాడిక్ కామెడీ ఎంటర్టైనర్ జపాన్ లో కూడా సునీల్ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు.
ఇక విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా పవర్ ఫుల్ విలన్ గా సునీల్ నటిస్తున్నాడు. దీనికి సంబందించిన లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు. పుష్పలో సునీల్ చేసిన క్యారెక్టర్ తరహాలోనే మార్క్ ఆంటోనీ సినిమాలో కూడా అతని పాత్ర ఉండటం విశేషం. ఇవి మాత్రమే కాకుండా కొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా సునీల్ ని విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే కన్నడంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల కోసం సునీల్ ని సంప్రదిస్తున్నారు. మొత్తానికి ఒక్క పుష్ప సినిమాతో ఇంతకాలం టాలీవుడ్ కి పరిమితం అయిన సునీల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడని చెప్పాలి.