• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ స్టార్...

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్‌ని హింసించిన ట్యాలెంటెడ్ హీరో?

| నాగవంశీ వ్యాఖ్యల ప్రకారం.. అడివి శేష్ వంటి హీరోలు కథ విషయంలో లేదా మేకింగ్ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు.

By - Sivaji Kontham
Update: 2026-04-08 04:26 GMT

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తాజాగా `డెకాయిట్` చిత్రం ప్ర‌మోష‌న‌ల్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణంగా తన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే నాగవంశీ.. హీరో అడివి శేష్ తన నిర్మాత సుప్రియ‌ను రెండేళ్ల పాటు ఇబ్బంది పెట్టాడని చేసిన సరదా వ్యాఖ్యలు సినిమా వెనుక ఉండే అసలు కష్టాలను మరోసారి గుర్తుచేశాయి. బయటి హీరోలతో సినిమాలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని.. నిర్మాతలకు ఉండే తలనొప్పులు ఎలా ఉంటాయో ఆయన తనదైన శైలిలో వివరించారు.

సినిమా రంగంలో హీరోల ఆధిపత్యం పెరిగిపోతోందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గొంతెమ్మ కోర్కెలు కోరే హీరోయిన్లను సినిమా నుంచి వెంటనే తొలగించడం సులభమే కానీ.. హీరోల విషయంలో అది సాధ్యం కాదని ఇండ‌స్ట్రీ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్లనే కొన్ని కారణాల వల్ల సినిమాల నుండి తప్పించిన దాఖలాలు ఉన్నాయి.. కానీ ఒక హీరో ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత నిర్మాతలకు ఎంతటి తలనొప్పులు ఎదురైనా భరించక తప్పని పరిస్థితి ఉంటుంది.

నాగవంశీ వ్యాఖ్యల ప్రకారం.. అడివి శేష్ వంటి హీరోలు కథ విషయంలో లేదా మేకింగ్ విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. ఈ క్రమంలో నిర్మాతలకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురుకావచ్చు. సుప్రియ యార్లగడ్డ వంటి నిర్మాతలు తమ సొంత కుటుంబ హీరోలతో సినిమాలు చేయడం వల్ల బయటి హీరోల వల్ల కలిగే కష్టాలు తెలియడం లేదని నాగవంశీ చమత్కరించారు. ప్రతి హీరోకు ఉండే ప్రత్యేకమైన ఆలోచనా విధానం.. పని తీరు నిర్మాతలకు సవాల్‌గా మారుతాయని ఆయన మాటల సారాంశం.

నిర్మాతలు హీరోలను నెత్తిన పెట్టుకుంటున్నారని.. అందుకే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సుప్రియపై నాగవంశీ వేసిన పంచ్ నవ్వులు పూయించినా.. అందులో కొంత చేదు నిజం కూడా ఉంది. సినిమా విజయం ప్రధానంగా హీరో ఇమేజ్ పై ఆధారపడి ఉండటంతో వారి డిమాండ్లను కాదనలేక నిర్మాతలు సర్దుకుపోతుంటారు. అయితే శేష్ తనను ఇబ్బంది పెట్టినందుకు థాంక్స్ చెప్పడం ద్వారా.. ఆ `హింస` సినిమా నాణ్యత కోసమే జరిగిందన్న విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా అంగీకరించారు.

మొత్తానికి వెండితెరపై మనం చూసే గ్లామర్ వెనుక నిర్మాత, హీరో మధ్య ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. బడ్జెట్ నియంత్రణ.. షూటింగ్ షెడ్యూల్స్.. క్రియేటివ్ విభేదాలు వంటివి నిర్మాతలను మానసికంగా హింసకు గురిచేస్తాయి. బయటి హీరోలతో పనిచేసేటప్పుడు ఈ ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. నాగవంశీ చేసిన ఈ చిలిపి విమర్శలు సినిమా నిర్మాణం అనేది కేవలం డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు.. మనుషుల మధ్య జరిగే ఒక పెద్ద సమరం అని స్పష్టం చేస్తున్నాయి.


హీరోలను మీరు నెత్తిన పెట్టుకుంటున్నారని సుప్రియ గారు మాకు క్లాసులు పీకుతారు. సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో చూపించిన #AdiviSesh గారికి థాంక్స్. - #NagaVamsi #Dacoit #MrunalThakur #Tollywood #Tupaki Follow 👉 @tupaki_official pic.twitter.com/vudmDf8tpZ

— Tupaki (@tupaki_official) April 7, 2026
Tags:    
  • nagavamsi 
  • adivisesh 
  • tollywood 
  • telugucinema 
  • filmindustry 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS