• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేడెక్కిస్తున్న వారియ‌ర్...

వేడెక్కిస్తున్న వారియ‌ర్ ఫిలిం

By - Tupaki Desk
Update: 2019-01-21 05:04 GMT
`బాహుబ‌లి` స్ఫూర్తితో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో భారీ మ‌ల్టీస్టార‌ర్లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ కోవ‌లో కొన్ని వైఫ‌ల్యాలు క‌నిపించినా, ప్ర‌య‌త్నాలు మాత్రం ఆగ‌డం లేదు. అమీర్ - అమితాబ్ ల‌ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` ఫ‌లితం నిరాశ‌ప‌రిచినా, బాలీవుడ్ లోనూ భారీ మ‌ల్టీస్టార‌ర్ల విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. వీటికోసం అతిభారీ బ‌డ్జెట్లు కేటాయిస్తున్నారు. మ‌ల‌యాళంలోనూ ఈ ట్రెండ్ కొన‌సాగుతోంది. ఈ కోవ‌లోనే మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్నారు.

లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో ప్రియదర్శన్  తెర‌కెక్కిస్తున్న‌ బహు భాషా చిత్రం `మరక్కార్‌: అరబికడలింటే సింహమ్‌` మ‌ల్టీస్టార‌ర్ కేట‌గిరీకే చెందుతుంది. ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ కేటాయించారు. యాక్షన్‌ కింగ్‌ అర్జున్, సునీల్‌ శెట్టి, ప్రభుదేవా, నాగార్జున‌, కీర్తీ సురేశ్, ప్రణవ్‌ మోహన్‌ లాల్, కల్యాణి ప్రియదర్శన్ త‌దిత‌ర తారాగ‌ణంతో ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాని అన్ని భాష‌ల్లో రిలీజ్ చేసి భారీగా వ‌సూళ్లు ఆర్జించాల‌న్న‌ది ప్లాన్.

హైదరాబాద్‌ లో ఓ ప్రముఖ స్టూడియోలో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతోంద‌ని తెలుస్తోంది. మోహన్‌ లాల్, సునీల్‌ శెట్టి, ప్రభుదేవా త‌దిత‌ర తారాగ‌ణంపై కీలక సన్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సునీల్‌ శెట్టి లుక్ ను రిలీజ్‌ చేశారు. సునీల్ లుక్ ... ట్రాయ్, గ్లాడియేట‌ర్, 300 వంటి హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో రూపొందించిన‌దిగా క‌నిపిస్తోంది. సునీల్ ఈ చిత్రంలో ఓ వారియ‌ర్ కింగ్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున‌పై చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.
Tags:    
  • Sunil Shetty 
  • kunjali marakkar 
  • First look 
  • telugu news 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS