• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు కన్నడ 'DTS' లో...

తెలుగు కన్నడ 'DTS' లో సూరజ్ దేవ్ గా సునీల్..!

By - Tupaki Desk
Update: 2021-04-14 14:41 GMT
ప్రముఖ హాస్యనటుడు కమ్ హీరో సునీల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''డీటీఎస్'' (DTS). 'డేర్ టు స్లీప్' అనేది దీనికి ఉపశీర్షిక. ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ బైలింగ్వల్ లో శాండిల్ వుడ్ యంగ్ హీరో చేతన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇందులో డోనల్ - నటాషా అనే కొత్తమ్మాయిలు కథానాయికలుగా నటిస్తున్నారు. అభిరామ్ పిల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

'డీటీఎస్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ ప్రొడ్యూసర్ గా మారుతున్నాడు. శ్రీమతి దివిజ సమర్పణలో ఎస్ఎస్ స్టూడియోస్ బ్యానర్ పై సాయి కార్తీక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంగీతం కూడా ఆయనే సమకూరుస్తున్నాడు. శ్రీకాంత్ దీపాల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే ఉగాది సందర్భంగా సునీల్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ లో సూరజ్ దేవ్ అనే పవర్ ఫుల్ పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో సునీల్ వైలెంటుగా కనిపిస్తున్నాడు. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఓ వైపు హీరోగా మరోవైపు క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీగా గడుపుతున్న సునీల్.. 'డీటీఎస్' సినిమాతో కన్నడ మార్కెట్ ని కూడా టార్గెట్ చేస్తున్నాడు. మరి 'డీటీఎస్' హీరోగా అతడికెలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    
  • Sunil 
  • Telugu 
  • Kannada 
  • DTS 
  • Movie News 
  • Telugu News 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS