• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సందీప్.. పాత ఫ్రెండ్స్...

సందీప్.. పాత ఫ్రెండ్స్ ఎక్కడో

By - Tupaki Desk
Update: 2017-12-29 04:15 GMT
ఫ్రెండ్స్ గొడవ పడుతుండటం.. మళ్లీ కలిసిపోవడం.. తిరిగి కలిసిపోవడం కామనే. కానీ సినిమా ఇండస్ట్రీలో గొడవలు మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. వాళ్లు గొడవ పడతారు. కానీ ఆ విషయం పైకి చెప్పరు. ఎవరైనా అడిగినా అబ్బే అదేం లేదంటారు. మేమింకా మంచి ఫ్రెండ్స్ అనే చెబుతారు. కానీ పక్కపక్కన ఎప్పుడూ కలిసి కనిపించనే కనిపించరు. ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనడానికి ఓరకంగా అదో హింట్ లాంటిదన్నమాట.

యంగ్ హీరో సందీప్ కిషన్ ఆఫ్ స్క్రీన్ లోనూ చాలా హుషారుగా ఉంటాడు.  పార్టీలు.. రెస్టారెంట్లు ఇలాంటి వాటిలో యమ యాక్టివ్ గా ఉంటాడు. అందుకే అతడితో పాటు కలిసి నటించిన హీరోయిన్లు కూడా అతడితో పాటు పార్టీలకు వచ్చి సందడి చేసి వెళ్తుండేవారు. సందీప్ పక్కన తొలిసినిమా చేసి పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. చెన్నై చిన్నది రెజీనా కెసాండ్రా ఇలా తరచుగా రెస్టారెంట్లలో సందీప్ తో పాటే కనిపించేవారు. ఆమధ్య కొన్నాళ్లపాటు రాశీఖన్నా కూడా అతడితో కనిపించేది. అదేమిటో ఈ మధ్య వీళ్లంతా మిస్సయిపోతున్నారు. తాజాగా సందీప్ రెస్టారెంట్ లోఇంతకు ముందెప్పుడూ కనిపించని లావణ్య త్రిపాఠి కొత్తగా కనిపించింది.  పాత్ర ఫ్రెండ్స్ తో గొడవ పడ్డాడన్నది అతడి వెంట ఉండే సన్నిహితుల అనుమానం. దీనిపై సందీప్ మాత్రం సైలెంట్ గానే ఉన్నాడు.

ప్రస్తుతం తెలుగుకన్నా తమిళంలోనే సందీప్ కిషన్ కు ఆఫర్లు బాగా వస్తున్నాయి. కాస్తో కూస్తో కలెక్షన్లు కూడా అక్కడే బాగా వస్తున్నాయి. రీసెంట్ గా నాపేరు శివ ఫేం సుశీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన కేర్ అఫ్  సూర్య కూడా సందీప్ కు నిరాశే మిగిల్చింది. లేటెస్ట్ గా తమిళంలో మాయవన్ పేరుతో తీసిన సినిమాను ప్రాజెక్టు జడ్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో సందీప్ లేటెస్ట్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.


Tags:    
  • Sundeep Kishan 
  • Lavanya Tripathi 
  • Restaurant Launch 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS