సందీప్ కిషన్.. మంచి ఛాన్సే పట్టాడు

Update: 2015-09-19 09:30 GMT
యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమాలు చేసే జోరు చూస్తే.. అతడికి వచ్చే అవకాశాలు గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసబెట్టి అవకాశాలు సంపాదిస్తుంటాడు సందీప్. ప్లాపుల్లో ఉన్నపుడే అతడికి అవకాశాలు ఆగలేదు. ఇప్పుడతను ‘టైగర్’ లాంటి హిట్టుతో ఉన్నాడు. ఇక అవకాశాలకు కొదవేముంది చెప్పండి. తాజాగా అతడో క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేశాడు.

తమిళ ప్రొడ్యూసర్ సీవీ కుమార్ దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్న సినిమా ఇది. దర్శకుడు నిర్మాత కావడం మామూలే కానీ.. నిర్మాతలు దర్శకులవడం అరుదు. ఐతే ఈ సీవీ కుమార్ ఇండస్ట్రీలోకి వచ్చిందే దర్శకుడవుదామని. ఐతే ముందు నిర్మాత అయ్యాడు. తన నిర్మాణంలో అద్భుతమైన, వినూత్నమైన సినిమాలు తీశాడు కుమార్. సూదుకవ్వుం లాంటి బ్లాక్ బస్టర్ తో అతను నిర్మాతగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అట్టకత్తి - పిజ్జా - యనకుల్ ఒరువన్ లాంటి విభిన్నమైన సినిమాలు నిర్మించాడు. ప్రస్తుతం ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఇరైవి, ‘కాకా ముట్టై’ ఫేమ్ మణికందన్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాడు.

నిర్మాతగానే తన టేస్టేంటో చూపించిన సీవీ కుమార్ దర్శకుడిగానూ విభిన్నమైన సినిమానే తీస్తాడనడంలో సందేహం లేదు. అలాంటి వాడు సందీప్ ను ఏరికోరి ఎంచుకోవడం విశేషమే. ఈ సినిమా ఆటోమేటిగ్గా తెలుగులోకి కూడా వస్తుంది. జిబ్రాన్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్నాడు. సందీప్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కూడా ద్విభాషా చిత్రమే. రెజీనా జోడీగా ఓ థ్రిల్లర్ సినిమాలో అతను నటిస్తున్నాడు.
Tags:    

Similar News