• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'హగ్ లు వద్దులే.. అసలే...

'హగ్ లు వద్దులే.. అసలే చలికాలం'

By - Tupaki Desk
Update: 2020-12-24 10:50 GMT
లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుమంత్. ఫస్ట్ సినిమా 'ప్రేమకథ'లో మంచి నటన కనబరిచి ఆకట్టుకున్న సుమంత్.. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. 'సత్యం' 'గౌరీ' 'మధుమాసం' 'గోదావరి' 'గోల్కొండ హైస్కూల్' 'మళ్లీ రావా' వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. గత ఏడాది 'ఎన్టీఆర్ బయోపిక్' రెండు భాగాల్లో తన తాత ఏఎన్నార్ పాత్రను పోషించి ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో 'క‌ప‌ట‌ధారి' అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ తో వస్తున్నాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్‌ పై ధనుంజయన్ నిర్మించారు. కన్నడ హిట్ సినిమా 'కవలధారి' సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ తో కలిసి తాజాగా ఓ చిట్ చాట్ షోలో పాల్గొన్న సుమంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' కమెడియన్ హర్షతో ‘తమాషా విత్ హర్షా' అనే ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో పలువురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి 'క‌ప‌ట‌ధారి' హీరోయిన్ నందితా శ్వేతతో కలిసి హాజరయ్యాడు సుమంత్. సినిమాల విషయాలతో పాటు యాంకర్ హర్షాతో కలిసి సందడి చేశారు. 'ధన51' సినిమా ఎన్ని పెగ్గులేసి ఓకే చేశారు సర్ అని హర్ష అడుగగా.. 'ఆ సినిమాలో నటించేటప్పుడు వేయాల్సింది' అని సుమంత్ చెప్పారు. అలానే ఓ సందర్భంలో హర్ష ‘మీరు కావాలంటే హగ్ చేసుకోవచ్చు' అని అనడంతో దీనికి స్పందించిన సుమంత్.. ‘మన హగ్గులు కొంచెం.. ఆగవు.. వద్దులే.. అసలే చలికాలం' అంటూ నవ్వుతూ అన్నాడు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=bCscKEo13vI

Tags:    
  • Kapatadhaari 
  • Sumanth 
  • Nandita Swetha 
  • Viva Harsha 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS