తన గురించి షాకింగ్ నిజాన్ని వెల్లడించిన సుమ
సుమ అన్నంతనే నవ్వుతూ.. చలాకీగా ఉండే ముఖం గుర్తుకు వస్తుంది. స్పష్టమైన తెలుగుతో పాటు.. మాటలతో ఎవరినైనా ఇట్టే ఆడేసుకోవటమే కాదు.. పంచ్ ల మీద పంచ్ లు వేస్తూ.. తెలుగు లోగిళ్లలో ఆడపిల్లలా మారిపోయింది. అలాంటి సుమ తనకు సంబంధించిన ఒక నిజాన్ని తాజాగా బయటపెట్టింది. ఇంతకాలం తాను ఈ నిజాన్ని దాచి ఉంచానని.. ఇకపై ఆ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో బయటకు చెబుతున్నట్లుగా వెల్లడించారు.
ఇంతకీ సుమ చెప్పిన ఆ నిజం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆమె ఒక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏదైనా గాయం అయితే అది మరింత పెద్దదిగా మారి.. చుట్టుపక్కలకు వ్యాపిస్తుందని చెప్పారు. అంటే.. చిన్న గాయమైనా పెద్దదిగా చూపించటం ఈ ఆరోగ్య సమస్య లక్షణం. దీన్ని అధిగమించటానికి చేయాల్సిన అన్ని వైద్యాలు చేశానని.. కానీ ఫలితం లేకుండాపోయిందని చెప్పారు.
చివరకు ఇది తన శరీరంలో భాగమైనట్లుగా పేర్కొన్నారు. యాంకరింగ్ లోకి వచ్చినప్పుడు మేకప్ ఎలా వేసుకోవాలి? ఎలా తీసేయాలి? లాంటివి తెలీక జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందన్నారు. ఇప్పుడు ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. మన శరీరంలో మనకు ఏదైనా నచ్చకపోతే.. ఎవరైనా ఏదైనా అనుకుంటారని దాన్ని దాచి పెడుతూ వస్తామని.. కానీ అది మనతోనే ఉన్నప్పుడు ఆ విషయాన్ని అంగీకరించటం ద్వారా సంతోషంగా ఉంటామని చెబుతూ.. అసలు నిజాన్ని ఇన్నాళ్లకు బయటపెట్టేసింది. సుమ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య గురించి తెలిసిన వారు.. ఇంత పెద్ద సమస్య ఉంచుకొని మరీ ఇంతలా చలాకీగా ఉండటాన్ని మెచ్చుకుంటున్నారు. ఆమె సమస్యకు ఎవరైనా సరైన సొల్యూషన్ వెతికితే బాగుండు.