నాగశౌర్యతో సుకుమార్ శిష్యుడి కొత్త సినిమా..

Update: 2020-03-17 11:30 GMT
ఛలో సినిమా తర్వాత హీరో నాగశౌర్యకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఛలో సినిమా తర్వాత కొన్ని రెండు మూడు సినిమాలు విడుదలైన ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా తను స్వయంగా కథ అందించి నటించిన అశ్వద్ధామ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాను కూడా తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడ్యూస్ చేసి నిర్మాతగా కూడా నష్టపోయాడు. అశ్వద్ధామ సినిమా తర్వాత కొంచెం అలోచించి అడుగేస్తే బాగుంటుందని అనుకున్నట్లున్నాడు.

సొంత కథలను ఇవ్వడం ఆపేసి హీరోగా మంచి కథలను ఎంచుకొని నటిస్తూ పోతే అయిపోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రీసెంట్ గా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ విశాల్ చెప్పిన కథను ఓకే చేసినట్లు సమాచారం. దీని ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మరో కొత్త దర్శకుడు పరిచయమవుతాడు. ఈ సినిమాలో నాగశౌర్య కు జంటగా కేతిక శర్మను ఎంపిక చేసారంట.

ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, శరత్ మరార్ లు కలిసి నిర్మిస్తుండటం విశేషం. డైరెక్టర్ సుకుమార్ దగ్గర నుండి ఇప్పటికే సూర్య ప్రతాప్, బుచ్చిబాబులు దర్శకులుగా తమ సత్తాను చాటుకుంటున్నారు. మరి కాశీ విశాల్ కూడా సక్సెస్ అవుతాడా.. నాగశౌర్యకు హిట్ సినిమాను అందిస్తాడా అనేదే సందేహం. ఈ సినిమా దర్శకుడికి సుకుమార్ కూడా తగిన సూచనలు చేస్తున్నాడట. మరి సినిమా పట్టాలెక్కేది ఎప్పుడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.
Tags:    

Similar News