రామ్ తో 'జగడం' రీమేక్ చేస్తా: సుకుమార్
సీనియర్ స్టార్ హీరోల కుటుంబాల నుంచి .. దర్శక నిర్మాతల ఫ్యామిలీస్ నుంచి తెలుగు తెరకు చాలామంది హీరోలు వచ్చారు. అలా వచ్చినవారిలో టాలెంట్ ఉన్నవారు మాత్రమే నిలదొక్కుకున్నారు. మిగతావారు అరడజను సినిమాల దగ్గరే సర్దుకున్నారు.
అలా ఒక బలమైన సినిమా నేపథ్యం కలిగిన నిర్మాతల ఫ్యామిలీ నుంచి రామ్ వచ్చాడు. బక్కపలచగా .. కాస్త ఎర్రగా ఉన్న రామ్ ను చూసి కుర్రాడు స్టైల్ గానే ఉన్నాడే అనుకున్నారు. అలా ఫస్టు లుక్ తోనే రామ్ జనం నుంచి మంచి మార్కులు కొట్టేశాడు.
'దేవదాసు' సినిమాతో యూత్ హృదయాలను దోచేసిన రామ్, అమ్మాయిల కలల రాజుగా మారిపోయాడు. ఆ సినిమాలో ఆయనలోని మాస్ యాంగిల్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ వెంటనే ఆయన మాస్ కంటెంట్ ను కాస్త పెంచి సుకుమార్ దర్శకత్వంలో 'జగడం' సినిమాను చేశాడు.
అప్పటికి సుకుమార్ కూడా 'ఆర్య' సినిమా మాత్రమే చేసి ఉన్నాడు. అంటే ఈ ఇద్దరికీ కూడా 'జగడం' రెండవ సినిమానే. 2007 మార్చి 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంటే ఈ రోజుతో ఈ సినిమా 15 ఏళ్లను పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాను గుర్తుచేసుకున్నాడు. "ఈ సినిమా చేసేటప్పటికీ రామ్ కి 17 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. అయినా ఎప్పుడూ కూడా యాక్షన్ సీన్స్ చేయడానికి వెనుకాడలేదు. మొదటి నుంచి ఆయనలో అదే ఎనర్జీ ఉండేది. రామ్ చూడటానికి చాక్లెట్ బాయ్ లా ఉండేవాడు. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అలాంటి హీరోలు మాస్ ఆడియన్స్ అభిమానాన్ని పొందడం చాలా కష్టమైన విషయం. కానీ రామ్ తన రెండవ సినిమా అయిన 'జగడం'తోనే మాస్ ఇమేజ్ తెచ్చుకోవడం గొప్ప విషయం.
నేను బయట చాలా గొడవలు .. కొట్లాటలు చూశాను. నా సినిమాల్లోని ఫైట్లు కూడా అంతే నేచురల్ గా ఉండాలని అనుకునేవాడిని. ఈ సినిమాలో ఫైట్లు చాలా రియల్ గా అనిపిస్తాయి. ఏదేమైనా రామ్ నేను అనుకున్నదానికంటే చాలా దూరమే ప్రయాణం చేశాడు.
'జగడం' చాలా మంచి కథ. సరైన సమయంలో రిలీజ్ కాకపోవడం వలన రీచ్ కాలేదనే భావన నాలో ఉంది. అందువలన రామ్ తో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ వస్తే 'జగడం' రీమేక్ ను చేస్తాను" అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప 2' పనులలో ఉంటే, రామ్ 'ది వారియర్' సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తూ బోయపాటితో సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.