సుకుమార్ మళ్ళీ వెనక్కు వెళ్ళాలా
రంగస్థలం వచ్చి ఏడాది దాటేసింది. అదుగో పులి ఇదుగో తోక తరహాలో మహేష్ సినిమా ఉంటుంది మొదలవుతుంది అనుకుంటూనే అనూహ్యంగా అది ఆగిపోయి అల్లు అర్జున్ ది లైన్ లోకి వచ్చింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో బిజీ కాబోతున్న బన్నీ ఇంకో ఆరు నెలల వరకు ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. ఎంత వేగంగా షూటింగ్ ఫినిష్ చేసినా ఈ మాత్రం వ్యవధి అవసరం. ఇదిలా ఉండగా బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ ప్రకటించిన మరో రెండు సినిమాల్లో ఏది ముందు స్టార్ట్ అవుతుందనే దాని గురించి క్లారిటీ లేదు.
సుకుమార్ డైరెక్షన్ లో మైత్రి సంస్థ మూవీ ఉంటుందని చెప్పారు కానీ అంతకు మించి ఖచ్చితమైన వివరాలు షేర్ చేయలేదు. బన్నీ సుక్కు ఇద్దరూ కలిసి ఎక్కడో టాప్ ఫ్లోర్ లో కలిసి ముచ్చటించుకున్న ఫోటో తప్ప ఇంకే మెటీరియల్ బయటికి రాలేదు. కానీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే సినిమా టైటిల్ తో సహా ఏకంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఐకాన్ పేరుతో కనపడుట లేదు అనే ఉపశీర్షిక తగిలించి థీమ్ ని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారం త్రివిక్రమ్ మూవీ ఫినిష్ కాగానే సుకుమార్ బదులు మొదట ఈ ఐకాన్ తీస్తారట. ఫుల్ స్క్రిప్ట్ చేతిలో రెడీగా ఉంది కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతి లోపు షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. ఆ తర్వాత సుక్కుది లైన్ లో పెట్టాలని గీత కాంపౌండ్ ఆలోచిస్తున్నట్టుగా వినికిడి. అదే కనక జరిగితే సుకుమార్ వెయిటింగ్ మొత్తం రెండేళ్లకు చేరుతుంది. ఆపైన దాని నిర్మాణ కాలం అదనం. ఇందులో నిజానిజాలు నిర్ధారణ కావాలంటే టైం పడుతుంది కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం వాస్తవమే అనిపిస్తోంది