డ్రైక్లీనింగ్ చేస్తానంటున్న సుకుమార్

Update: 2017-03-07 07:34 GMT
సుకుమార్ ఏంటి.. డ్రైక్లీనింగ్ చేయడమేంటి అంటారా..? అతను కూడా నాన్-సినిమా బిజినెస్ లోకి దిగుతున్నాడు. సుకుమార్ ఫ్యామిలీ పెద్ద స్థాయిలో డ్రైక్లీనింగ్ బిజినెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినీ రంగంలో సంపాదించిన రియల్ ఎస్టేట్లోనో  ఇంకో దాంట్లోనో మన సెలబ్రెటీలు పెట్టుబడులుగా పెట్టడం మామూలే. ఈ మధ్య కాలంలో చాలామంది రెస్టారెంట్ బిజినెస్ మీద దృష్టిపెడుతున్నారు. ఐతే సినిమాల విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరుచుకున్న సుకుమార్.. బిజినెస్ విషయంలోనూ మిగతా ఇండస్ట్రీ జనాలకు భిన్నంగా వెళ్తున్నాడు.

సుకుమార్ కుటుంబ సభ్యులు.. సన్నిహితులు కలిసి సుక్కు బ్రాండ్ నేమ్ వాడుకుంటూ కార్పొరేట్ లెవెల్లో డ్రై క్లీనింగ్ బిజినెస్ మొదలుపెట్టనున్నారట. ఇందుకోసం నానక్ రాం గూడలో భారీ ప్లాంట్ కూడా పెడుతున్నట్లు సమాచారం. రైల్వేస్.. హోటల్స్.. హాస్పిటళ్లతో భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుని పెద్ద స్థాయిలో ఈ బిజినెస్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టర్నోవర్ పెద్ద స్థాయిలోనే ఉంటుందంటున్నారు. ఇది బాగా క్లిక్కయ్యేందుకు.. పెద్ద స్థాయికి వెళ్లేందుకు అవకాశమున్న బిజినెస్. బాగా స్టడీ చేసి ఇందులోకి దిగుతున్నాడట సుక్కు. రేప్పొద్దున సినీ రంగంలో తేడా వచ్చినా.. దీని మీద సుక్కు ఫ్యామిలీ బతికేయొచ్చు. మొత్తానికి సుకుమార్ తెలివే తెలివి కదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News