పనులు మొదలెట్టేసిన సుక్కు..

Update: 2016-12-18 04:37 GMT
జనవరి నెల చివరి వారం నుంచి రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందనే విషయం ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. మెగా మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రొడ్యూసర్ గా అప్పటివరకూ బిజీగా ఉండనున్న చెర్రీ.. చిన్న గ్యాప్ తో సుకుమార్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ రోల్ కి అనుపమా పరమేశ్వరన్ ని ఫైనల్ చేశారనే వార్తలున్నాయి.

మరోవైపు ఈ చిత్రంకోసం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఇది పల్లెటూరి ప్రేమ కథ కావడంతో.. లొకేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం దర్శకుడు సుకుమార్.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. పక్కా స్క్రిప్ట్ రెడీ అయిపోవడంతో.. అందుకు తగిన లొకేషన్స్ ను ఫైనల్ చేసుకుంటున్నారు.

హై బడ్జెట్ మూవీ కావడంతో లొకేషన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట సుకుమార్. దర్శకుడి ఆలోచన మేరకు రత్నవేలు కూడా ప్రతీ ఫ్రేమ్ ని అందంగా తీర్చిదిద్దుతానని అంటున్న రత్నవేలు.. ఈ విషయంలో మరింత పట్టుదల చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పక్కా పల్లెటూరి నేటివిటీ ఎలా ఉంటుందో చూపించేందుకు రెడీ అయిపోతోంది సుక్కు టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News