ఆ కుర్ర దర్శకుడికి సుక్కు ఛాన్స్

Update: 2016-10-12 13:30 GMT
డైరెక్టర్ సుకుమార్ యంగ్ టాలెంట్ ను బాగా ప్రోత్సహిస్తున్నాడు ఈ మధ్య. తన శిష్యుడైన సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో ‘కుమారి 21 ఎఫ్’ సినిమాను సుకుమారే స్వయంగా నిర్మించడమే కాదు.. దానికి స్క్రిప్టు కూడా అందించాడు. తన ప్రొడక్షన్లో మరో సినిమాకు కూడా రంగం సిద్ధం చేస్తున్నాడు సుక్కు. దానికి కూడా ఆయనే స్క్రిప్టు సమకూరుస్తున్నాడు కూడా. మరోవైపు ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్న యువ దర్శకడు శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో సుక్కు ఓ సినిమా నిర్మించబోతుండటం విశేషం. శ్రీనివాసరెడ్డి.. పూర్ణ జంటగా నటించిన ఈ చిత్రానికి శివరాజ్ నిర్మాత కూడా.

ఈ మధ్యే సుక్కు చేతుల మీదుగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’లోని పాట ఒకటి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాని కంటే ముందు సుక్కుకు ఈ సినిమా రషెస్ చూపించారట. అది చూసి ఇంప్రెస్ అయ్యాకే సుక్కు ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగానే శివరాజ్ దర్శకత్వంలో తన ప్రొడక్షన్లో కొత్త సినిమా నిర్మించడానికి ఓకే చెప్పాడు సుక్కు. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఇలా ఓ పెద్ద దర్శకుడిని ఇంప్రెస్ చేసి.. తన ప్రొడక్షన్లో సినిమా చేసే అవకాశం దక్కించుకోవడమంటే విశేషమే. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ప్రోమోలు మొదట్నుంచి బాగానే ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News