కొత్తపల్లి అండ్ హోప్ ఐల్యాండ్ లో..

Update: 2016-12-21 07:30 GMT
ధృవ సక్సెస్ తో కొత్త జోష్ లో ఉన్నాడు రామ్ చరణ్. అంతేకాదు ఇకనుంచి సినిమాల కథాపరంగా కూడా ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్లూ మాస్ సబ్జెక్ట్స్ అంటే ఆసక్తి చూపించిన చెర్రీ ధృవతో రూట్ మార్చాడనే విషయం సుకుమార్ కాంబినేషన్లో మూవీ అది కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రంలో నటిస్తుండటంతో క్లియర్ గా అర్థమవుతుంది.

ఇక త్వరలో ప్రారంభం కానున్న కొత్త సినిమాకి సంబంధించి లోకేషన్స్ వెదికే పనిలో బిజీబిజీగా ఉన్నారు సుకుమార్ అండ్ కో. రిచ్ లోకేషన్సే కాదు పల్లె వాతావరణాన్ని కూడా సుక్కు అద్భుతంగా చూపించగలడు. ఆర్య మూవీనే దీనికి ఎగ్జాంపుల్. ఇక రామ్ చరణ్ సినిమాలో కోనసీమ అందాల్ని చూపించాలని ఫిక్సయాడట. గోదావరి జిల్లాల చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు కొత్తపల్లి గ్రామం.. కాకినాడ దగ్గరున్న హోప్ ఐల్యాండ్ దీవుల దగ్గర ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. ఆల్రెడీ ఈ ప్రాంతంలో సుక్కూ అండ్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు బోటు వేసుకుని లొకేషన్లు వెతకడం మనం కొన్ని ఫోటోల్లో చూశాం కూడా.

కోనసీమతో పాటు పొల్లాచ్చిలోనూ కొంత భాగం షూటింగ్ జరగనుంది. ఇక ధృవలో పోలీసాఫీర్ గా అలరించిన చెర్రీ కొత్త సినిమాలో పక్కా పల్లెటూరి అబ్బాయ్ గా కనిపించనున్నాడు. హీరోల మేకోవర్స్ మార్చడంలో సుకుమార్ ఎక్స్ పర్ట్ కాబట్టి చరణ్ గెటప్ అదిరిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు. చెర్రీ పక్కన హీరోయిన్ ఎవరు నటిస్తారనే విషయాన్ని త్వరలో ప్రకటించే అవకాశముంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News