హీరోయిన్లతో ప్రయోగాల అవసరమా సుక్కు
రామ్ చరణ్ మూవీ ధృవ రిలీజ్ అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. వచ్చే వారం రిలీజ్ కావాల్సిన పోటీ సినిమాలు కూడా తప్పుకోవడంతో.. ఇక ధృవకు రెండు రోజుల పాటు కాంపిటీషన్ లేనట్లే. నిజానికి ధృవ రిలీజ్ కాగానే.. వారం గ్యాప్ లో చరణ్ కొత్త సినిమా మొదలైపోవాలి. సుకుమార్ డైరెక్షన్ లో మూవీ కోసం ఇప్పటికే సకలం సిద్ధం అయిపోయాయి. ఒక్క హీరోయిన్ సంగతి మాత్రమే మినహాయింపు.
ఇప్పటికే రాశి ఖన్నా.. సమంతలను ఆడిషన్ చేశారు కానీ.. ఎవరూ ఫైనల్ కాలేదట. అసలు సుకుమార్ సినిమాలకు ఇలా హీరోయిన్ కష్టాలు కనిపిస్తూనే ఉంటాయి. హీరోయిన్ పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉండేలా రోల్ డిజైన్ చేయడం ఈ దర్శకుడి స్పెషాలిటీ. గతంలో మహేష్ బాబుతో 1-నేనొక్కడినే చిత్రం కోసం చాలామందిని ఆడిషన్ చేసీచేసీ.. చివరకు కొత్తమ్మాయి కృతి సనోన్ తో చేశాడు సుకుమార్. అఫ్ కోర్స్.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు.
ఇప్పుడు మళ్లీ మెగాపవర్ స్టార్ మూవీ కోసం హీరోయిన్ వేట సాగుతోంది. చివరకు మళ్లీ ఎవరైనా కొత్త హీరోయిన్ ని పట్టుకొస్తారేమో అని డౌట్స్ మొదలైపోయాయి. స్టార్ హీరోయిన్స్ తో అంటే కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. కొత్త భామలతో ఆ అడ్వాంటేజ్ ఉండదు. అలా కొత్త భామల కాన్సెప్ట్ అచ్చి రాలేదుగా సుక్కూ.. ప్రయోగాలు ఎందుకు అనుకుంటున్నారు మెగాభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/