సుకుమార్ సినిమాకు దేవినే ఎందుకు?

Update: 2021-12-28 09:31 GMT
సుకుమార్ తెర‌కెక్కించిన భారీ చిత్రం `పుష్ప‌`. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ పార్ట్ 1గా `పుష్ప - ది రైజ్‌` పేరుతో ఈ నెల 17న వ‌రల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై పాన్ ఇండియా స్థాయిలో వ‌సూళ్లు వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లోనూ రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలుస్తోంది.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్ర పార్ట్ 2 `పుష్ప : ది రూలర్` షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాని ఇప్ప‌టికీ వివిధ వేదిక‌ల‌పై ప్ర‌మోట్ చేస్తూనే వుంది. తాజాగా చిత్ర బృందం `ఆహా` కోసం నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బీకే` టాక్ షో లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బాల‌య్య అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సుకుమార్ చెప్పిన స‌మాధానాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.మీ ప్ర‌తి సినిమాకు దేవిశ్రీ‌ప్ర‌సాద్ నే సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకుంటార‌ని, అత‌నంటే ఎందుకంతే ప్రేమ అని బాల‌కృష్ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ ని ప్ర‌శ్నించారు. దీనికి సుకుమార్ నుంచి స‌ర్‌ప్రైజింగ్ ఆన్స‌ర్ వ‌చ్చింది. మ్యూజిక్ గురించి త‌న‌కు పెద్ద‌గా తెలియ‌ద‌ని, `ఆనందం`పాట‌లు విడుద‌లైన ద‌గ్గ‌రి నుంచి అత‌ని మ్యూజిక్ ని ఇష్ట‌ప‌డ‌టం మొద‌లుపెట్టాన‌ని తెలిపారు.

అంతే కాకుండా యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం సీనియ‌ర్స్ కంటే చాలా సౌక‌ర్యవంతంగా వుంటుంద‌ని, ఆకార‌ణంగానే డీఎస్పీతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం మొద‌లుపెట్టాన‌ని స్ప‌ష్టం చేశారు సుకుమార్‌. ఇదే కార్య‌క్ర‌మంలో హీరో బ‌న్నీతో పాటు హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న కూడా పాల్గొంది. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్ `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతూ వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.


Tags:    

Similar News