అందరినీ ఏడిపించిన సుకుమార్ లేఖ
సుకుమార్.. తన సినిమాలే కాదు.. తన ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయని చాలా సందర్భాల్లో రుజువైంది. తను నమ్మిన వారి కోసం ప్రాణాలిస్తాడు. స్నేహానికి విలువిస్తాడు.. తన కింద పనిచేసే వారి కోసం ఏకంగా నిర్మాతగా మారాడు.
ఇప్పటికీ సుకుమార్ కింద దర్శకత్వ శాఖలో పనిచేసే వారిని ఎంకరేజ్ చేసేందుకు నిర్మాతగా మారి స్వయంగా కథలు రాసి మరీ.. సినిమాలను సుకుమార్ నిర్మిస్తుంటారు.
అయితే కొద్దిరోజులుగా సుకుమార్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆయన ప్రాణ స్నేహితుడు.. సుకుమార్ మేనేజర్ కూడా అయిన ప్రసాద్ ఇటీవలే మరణించాడు. అతడి మరణాన్ని తట్టుకోలేకపోయిన సుకుమార్ ఆనాడే బాధను వ్యక్తం చేశాడు.
తాజాగా ఈరోజు ప్రసాద్ బర్త్ డే. దీంతో అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తనదైన స్టైల్లో ఒక కథగా చెప్పాడు. ‘లేకపోవడం ఏంటి?’ అని ప్రసాద్ బతికి ఉన్నట్టు కలగన్న సుకుమార్ తనతో మాట్లాడిన సంభాషనను కథగా రాసి చివరకు అదొక కలగా మేలుకొని గుర్తు చేసుకున్నాడు.‘బావగాడికి’ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కన్నీటి లేఖతో విషెస్ చెప్పాడు. ఇప్పుడా లేఖ వైరల్ గా మారింది. తన సినిమాలాగే ఎంతో క్రియేటివిటీగా ఈ లేఖను సుకుమార్ రాయడం విశేషం.
సుకుమార్ భార్య తబిత కూడా ‘ప్రసాద్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.
Full View