సుకుమార్ ప్లానింగ్ అదుర్స్
సుకుమార్ .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ఈ తరం దర్శకులలో కథకి ప్రాధాన్యతనిచ్చి, ఆ కథపై కసరత్తు ఎక్కువగా చేసేవారి జాబితాలో సుకుమార్ కనిపిస్తాడు. కథాకథనాలపై ఆయనకి మంచి పట్టు ఉంది. తన సినిమాలకి తానే కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చుకుంటాడు. సందర్భానికి తగినట్టుగా .. పాత్రల స్వరూప స్వభావాలకి తగినట్టుగా పాటలు రాయించుకుంటాడు. తనకి కావలసిన ట్యూన్స్ ను దగ్గరుండి చేయించుకుంటాడు. ఇలా అన్నీ తానై చూసుకోవడం వలన, ఆయన సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది.
కథలో పాత్రల వైపు నుంచి .. సన్నివేశాల వైపు నుంచి ఎలాంటి బలహీనతలు లేకుండా సుకుమార్ చూసుకుంటాడు. అందువలన ఆయన ప్రాజెక్టులు లేట్ అవుతుంటాయి. ఒక ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకూ ఆయన మరో ప్రాజెక్టును టచ్ చేయడు. అందువల్లనే ఆడియన్స్ తో గ్యాప్ రానీయకుండా ఉండటం కోసం ఆయన నిర్మాతగా కూడా మారాడు. తన శిష్యులకు కథలను అందించేసి వాళ్లను సెట్స్ పైకి పంపించేస్తుంటాడు. ఈ విధంగా చేయడం వలన సుకుమార్ పేరు స్క్రీన్ పై నానుతూనే ఉంటుంది .. ప్రేక్షకులకు ఆయన టచ్ లో ఉన్నట్టుగానే ఉంటుంది. తన శిష్యుడు .. తన కథ .. అందువలన ఒక నిర్మాతగా ఆయనకి కావలసిన భరోసా ఉండనే ఉంది.
మొదటి నుంచి కూడా సుకుమార్ కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఒక కథకి .. మరో కథకి ఎలాంటి సంబంధం లేకుండా చూసుకుంటాడు. కనీసం ఒక కథకి మరో కథకి పోలికలు కనిపించడానికి కూడా ఆయన ఒప్పుకోడు. కథ నేపథ్యం నుంచే ఆయన తన కొత్తదనాన్ని మొదలుపెడతాడు. ఆయన గత చిత్రాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్టీఆర్ హీరోగా చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమా పూర్తిగా విదేశాల్లో జరుగుతుంది. అలాగే చరణ్ తో చేసిన 'రంగస్థలం' విషయానికొస్తే, పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుంది.
ప్రస్తుతం సుకుమార్ 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. బన్నీ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా, అడవి నేపథ్యంలో కొనసాగుతుంది. ఇలా వైవిధ్యానికి సుకుమార్ ప్రాధాన్యతనిస్తాడు. అంతేకాదు హీరోల లుక్ విషయంలోను సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. పై మూడు సినిమాల్లో హీరోల లుక్ అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. హీరోలను విలక్షణంగా చూపిస్తూ .. విజయాలను అందుకుంటున్నాడు. దర్శకుడిగానే కాదు .. నిర్మాతగాను తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. మొత్తానికి తాను వెళ్లే రూట్ విషయంలో సుకుమార్ పూర్తి క్లారిటీతో ఉన్నాడనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమైపోతోంది కదూ .. !