'తెలంగాణ పై సినిమా తీద్దాం' అనుకున్న క్రియేటివ్ డైరెక్టర్

Update: 2020-04-29 16:00 GMT
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న తరువాత ఊహించని విధంగా సుకుమార్‌ రెండేళ్ళకు పైగా విరామం తీసుకున్నాడు. మొత్తానికి ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ సినిమాగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా 'పుష్ప' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు.

సుకుమార్ రంగస్థలం తర్వాత మరో సినిమా చేయాలనీ అనుకున్నాడట. “ఇటీవల నేను తెలంగాణ విప్లవం గురించి అనేక పుస్తకాలు చదివాను. రంగస్థలం తరువాత దాని మీద సినిమాగా తీయాలని అనుకున్నాను. కాని ఇతర కారణాల వల్ల నేను దానిని పక్కన పెట్టి వేరే స్క్రిప్ట్ మీద పని చేయటం మొదలుపెట్టాను” అని సుకుమార్ తెలిపారు. అయితే.. తెలంగాణ సాయుధ పోరాటం మీద చిత్రం తీయడానికి ఓ స్టైలిష్ దర్శకుడు చూడటం చాలా ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. పుష్ప చిత్రం గత నెల నుండి షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నప్పటికీ లాక్డౌన్ కారణంగా ఆపేయడం జరిగింది. ప్రభుత్వం అనుమతించిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2021 సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయాలనేది సుకుమార్ టీమ్ ప్రణాళిక. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన వేష భాషలు పూర్తిగా మార్చనున్న విషయం తెలిసిందే..
Tags:    

Similar News