ఈసారి సుకుమారే రాసుకుంటున్నాడు

Update: 2016-12-13 11:30 GMT
అప్పట్లో ఆర్య.. ఆ సినిమా ఒక సంచలనం. సుకుమార్ అంటే ఇది అంటూ టాలీవుడ్ కు పరిచయం చేసింది. అయితే తరువాత సినిమాల్లో సుకుమార్ తాలూకు ఇంటెలిజంట్ స్ర్కీన్ ప్లే చాలా కనిపిస్తుంది కాని.. ఆ కథలన్నీ మనోడివి కావు. అవును ఆర్య సినిమా ఒక్కటే సుకుమార్ సొంత కథ. మిగతా కథలన్నీ ఆయన తన రైటింగ్ అసోసియేట్స్ తో కలసి క్రియేట్ చేసినవే. మొన్న వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాకు కూడా మూల కథ రాసింది వేరే రైటరులే.

ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే.. మరోసారి సుకుమార్ సొంతంగా ఒక కథను రాస్తున్నాడు. త్వరలో మనోడు రామ్ చరణ్‌ తో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను సుకుమారే రాశాడట. ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాపులో గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ కథను పూర్తిస్థాయిలో ఐడియా నుండి ఫుల్ లెంగ్త్ రెండు గంటల సినిమా వరకు మొత్తంగా రాసింది మన క్రియేటివ్ డైరక్టరేనట. చాన్నాళ్ళ తరువాత ఎందుకో తనే కథ మొత్తం రాసుకోవాలని అనుకున్నాడని తెలుస్తోంది. అయితే మాటలు మాత్రం వేరే వారు రాస్తున్నారులే.

ప్రస్తుతం ధృవ హ్యాంగోవర్ లో ఉన్న రామ్ చరణ్‌.. సంక్రాంతి పండగయ్యే వరకు రెస్ట్ తీసుకుని.. ఆ తరువాత ఈ సినిమాను మొదలెడతాడనే విషయం ఆల్రెడీ తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News