ఎన్టీఆర్ - బుచ్చిబాబు మూవీపై అంచనాలు పెంచేసిన సుక్కూ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 25న థియేటర్లలోకి రాబోతోంది. RRR తో నేషనల్ వైడ్ వచ్చే క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తారక్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ ఈ రివేంజ్ డ్రామాని నిర్మించనుంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే.
త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ - బుచ్చిబాబులతో సినిమాలు ఉంటాయని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఏది ముందు ఏది వెనుక అనేది స్పష్టత రావాల్సి ఉంది.
బుచ్చిబాబుతో తారక్ సినిమాపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. వీరి కాంబోపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా ఘన విజయాన్ని అందుకున్నాడు.
ఒక్క సినిమాతో వంద కోట్ల దర్శకుడిగా పిలవబడుతున్నాడు. సాధారణంగా సక్సెస్ జోష్ లో దర్శకులు వెంటనే కొత్త ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు తీసుకెళ్తుంటారు. కానీ బుచ్చి మాత్రం ఏడాది గడిచినా ఇంతవరకు నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయలేదు.
అయితే తారక్ కోసం బుచ్చిబాబు ఓ పవర్ ఫుల్ పాన్ ఇండియా స్టోరీ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే హీరో సైడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్ కూడా వచ్చిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో సుకుమార్ ఉప్పెన దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేశారు.
బుచ్చి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ సుక్కు ఓ వీడియో రిలీజ్ చేసారు. గొప్ప కథతో రాబోతున్నాడని.. పాన్ ఇండియా స్థాయిలో బుచ్చిబాబు సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షించారు.
''వచ్చే ఏడాదికి ఇంకో సక్సెస్ తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలి.. ఒక అద్భుతమైన సక్సెస్ తో పాన్ ఇండియా సినిమాతో.. కథ ఎంత గొప్పగా వచ్చిందో.. రాబోతుందో నాకు తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను'' అని సుకుమార్ అన్నారు.
బుచ్చిబాబు సినిమా ఎన్టీఆర్ తోనే అని సుక్కు చెప్పనప్పటికీ.. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని స్పష్టమైంది. ఇదొక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న మూవీ అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. కాకపోతే ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది? ఎన్టీఆర్ డేట్స్ ఎప్పుడు ఇస్తారు? అప్పటి వరకు తారక్ కోసం బుచ్చిబాబు వేచి చూస్తారా? లేదా ఈ గ్యాప్ లో వేరే హీరోతో ఓ సినిమా చేస్తారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.