బన్నీ లేదా చరణ్ అంటున్న సుక్కు
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇక తాను డైరెక్ట్ చేయబోయేది రెండే సినిమాలన్నాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. అందులో ఒకటి దేవిశ్రీ ప్రసాద్‌తో అన్నది ఇప్పటికే తేలిపోయింది. ఇంకోటి ఎవరితో అనే విషయంలో సప్పెన్స్ నడుస్తోంది. కొన్ని రోజులుగా రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. తన బాబాయి నిర్మాణంలో తాను చేయాల్సిన సినిమాను సుక్కుతోనే చేయాలని చరణ్ కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయంలో స్వయంగా సుక్కునే క్లారిటీ ఇచ్చేశాడు. పక్కాగా చరణ్ పేరు చెప్పలేదు కానీ.. అతను తన తర్వాతి సినిమా విషయంలో ఓ ఛాయిస్ అని మాత్రం స్పష్టం చేశాడు.
తన స్వగ్రామం మట్టపర్రుకు వచ్చిన సందర్భంగా ఓ మీడియా సంస్థతో సుకుమార్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ రామ్ చరణ్ తో తన తర్వాతి సినిమా ఉంటుందని వెల్లడించాడు. దేవిశ్రీ ప్రసాద్ తో సినిమా చేయాల్సి ఉందని.. ఐతే అది వెంటనే మొదలవుతుందా లేదా అన్నది చెప్పలేనని సుక్కు చెప్పాడు. దీన్ని బట్టి దేవితో సినిమాను సుక్కు ఇమీడియట్‌గా మొదలుపెట్టే అవకాశం లేదని తేలిపోయింది. ఇక చేయబోయేది రెండు సినిమాలే అని సుక్కు అన్నప్పటికీ అతడితో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు లైన్లో ఉన్నారు. రామ్ చరణ్ - దేవిలతో తన తర్వాతి రెండు సినిమాలు అనుకున్నా... బన్నీ - అఖిల్ - ఎన్టీఆర్ - మహేష్ ఇలా చాలామందే సుక్కుతో ఓ సినిమా చేయడానికి ఆసక్తితో కనిపిస్తున్నారు.