ఆ సినిమా ఏమైంది సుకుమార్?

Update: 2019-09-29 01:30 GMT
స్టార్ దర్శకుల్లో కొందరు సొంత బ్యానర్ స్థాపించి అందులో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి చిన్న సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఉనాడు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ను స్థాపించి తొలి ప్రయత్నంగా 'కుమారి 21'సినిమాను నిర్మించాడు. ఆ  సినిమా సుక్కుకి నిర్మాతగా మంచి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత నిర్మాతగా బ్రేక్ ఇచ్చి మళ్ళీ 'దర్శకుడు' అనే సినిమాను నిర్మించాడు సుక్కు.

ఈ సినిమాతో తన స్నేహితుడు ప్రసాద జక్కా కు డైరెక్షన్ అవకాశం ఇచ్చాడు సుక్కు. అయితే ఆ సినిమా అనుకోని విధంగా డిజాస్టర్ అయింది. అంతే ఇక నిర్మాతగా సుక్కు కి గ్యాప్ వచ్చేసింది. ఇక రంగస్థలం' సక్సెస్ ఇచ్చిన కిక్ తో వెంటనే రెండు బ్యానర్ లో రెండు సినిమాలు ప్లాన్ చేసాడు. కాకపోతే రెండు బానర్లతో టైయప్ పెట్టుకున్నాడు. అయితే సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా అలాగే నాగ శౌర్యతో మరో సినిమాలు అనుకున్నాడు. ఈ రెండు సినిమాలతో తన శిష్యులకు అవకాశం ఇచ్చాడు.

ఇక వైష్ణవ తేజ్ , బుచ్చి బాబు సినిమా షూటింగ్ లో ఉండగా నాగ శౌర్య తో చేయాల్సిన సినిమా మాత్రం షూటింగ్ వరకూ ఆగిపోయింది. ఈ సినిమాను శరత్ మరార్ తో కలిసి నిర్మించనున్నట్లు అనౌన్స్ కూడా చేసాడు. సినిమా కోసం ఓ ఆఫీస్ తీసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలేట్టారు. ఏమైందో ఏమో కానీ నాగ శౌర్య సినిమా నుండి బయటికి వచ్చేసాడు. అంతే ఇంత వరకూ ఆ సినిమా అప్డేట్ బయటికీ రాలేదు. ఈ సినిమాను సుక్కు మరో యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు ఆ మధ్య చక్కర్లు కొట్టినా ఇంత అవరకూ ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.  మరి సుక్కు ఆ సినిమాను లైట్ తీసుకున్నాడా లేదా మరో హీరోతో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సుక్కు నిర్మాణంలో మరో కాన్సెప్ట్ సినిమా వస్తుందనుకుంటే అది కాస్త ఇలా అటకెక్కింది.


Tags:    

Similar News